Homeఎంటర్టైన్మెంట్Prince Yawar: నేను ఇంటికి పోతాను బిగ్ బాస్ గేట్లు తెరవండి’’ అని ఎక్కి ఎక్కి...

Prince Yawar: నేను ఇంటికి పోతాను బిగ్ బాస్ గేట్లు తెరవండి’’ అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ప్రిన్స్ యావర్

Prince Yawar: బిగ్ బాస్ హౌస్ లో రోజుకు ఒక రచ్చ.. క్షణానికి ఒక పంచాయతీ అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. టెన్షన్ ఏ స్థాయికి వెళ్లిందంటే.. హౌస్ లో బాడీ బిల్డర్ అయిన ప్రిన్స్ యావర్ ఇంటికి వెళ్లి పోతాను అని చిన్న పిల్లాడిలా ఎక్కెక్కి ఏడ్చాడు. టాస్కులు రెండో పూర్తి చేసి మాయాస్త్రను గెలుచుకున్న రణధీర టీం నుంచి.. వారి దగ్గర ఉన్న మాయస్త్ర భాగాన్ని తీసుకొని అదే టీమ్ లో ఉన్న అర్హులైన సభ్యులకు ఇచ్చి, అలా ఎందుకు ఇస్తున్నారో తెలియపరచాలి అని బిగ్ బాస్ చెప్పారు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తరువాత రతిక చేసిన రచ్చ ఇంటి సభ్యులు అందరూ ఆమెపై రివర్స్ అయ్యేలా చేసింది. అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా రతిక అందరికీ సమాధానం చెప్పింది. హౌస్ లో రాను రాను రోజుకొకరు ఏదో ఒక రచ్చ లేపకుండా ఉండడం లేదు. మొన్న ప్రశాంత్ పులిహోర పంచాయతీ…నిన్న రాధిక రచ్చ…ఇప్పుడు పసిపాపల ఏడ్చే ప్రిన్స్ యావర్. ఇలా ఎవరికి తగ్గ కంటెంట్ వారు ప్రేక్షకులకు అందించి ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇచ్చిన టాస్క్ లో భాగంగా అనర్హులు అని భావించిన కంటెస్టెంట్స్ దగ్గర నుంచి అర్హులు అనుకున్న వారికి మాయాస్త్రాన్ని ఇవ్వవలసిందిగా బిగ్ బాస్ తెలియపరిచారు. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ మాయాత్ర భాగాలు ఉంటాయో వారే విజేత అని…రెండవ వారం వచ్చే పవర్ అస్త్ర వారికే లభిస్తుంది అని బిగ్ బాస్ అన్నారు. మొదటి పవరాస్త్ర 5 వారాల ఇమ్యూనిటీ ఇస్తే ఈ రెండవ పవర్ అస్త్ర నాలుగు వారాల ఇమ్యూనిటీని ఇస్తుంది. ఒకవేళ ఇప్పుడు నామినేట్ అయిన వాళ్లలో ఎవరికైనా ఆస్త్రం వస్తే వాళ్లు ఎలిమినేషన్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు .

ఈ నేపథ్యంలో శోభా శెట్టి అనర్హురాలు అని డిక్లేర్ చేసి ఆమె దగ్గర నుంచి మాయాస్త్ర భాగాన్ని తీసుకున్న శుభశ్రీ దాన్ని తీసుకువెళ్లి ప్రిన్స్ యావర్ చేతికి ఇచ్చింది. మరో పక్క పల్లవి ప్రశాంత్ అమర్‌ దీప్ దగ్గర భాగాన్ని శివాజీకి అందించాడు. ఇక ఆ తర్వాత రాధిక పాప రెచ్చిపోవడంతో ఎపిసోడ్ ముగిసిపోయింది. అంతటితో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనుకునేరు…అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఏకంగా ప్రిన్స్ అనర్హుడు అన్నాడు…తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే ఈ రచ్చ ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ అర్థం అవుతుంది. గౌతమ్ మాటలకు సీరియస్ అయిన ప్రిన్స్…నేను ఎందుకు అనర్హును రీసన్ చెప్పు అని గట్టిగానే అడిగాడు…అయితే గౌతం దానికి ఎటువంటి రీసన్ చెప్పకపోవడంతో ప్రిన్స్ రెచ్చిపోయి ఆల్మోస్ట్ గౌతమ్ ని కొట్టినంత పని చేశాడు. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది.. దీనికి బాగా రియాక్ట్ అయిన ప్రిన్స్ గెట్టిగా ఏడ్చేసి ..నన్ను ఇంటికి పంపేయండి …వెళ్లిపోతాను …గేట్లు ఓపెన్ చేయండి అంటూ ..బిగ్ బాస్ రిక్వెస్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఓదార్పులు, బుజ్జగింపులు కామనే కదా. సో తప్పకుండా ఈరోజు ఎపిసోడ్ లో జరగబోతున్న హై వోల్టేజ్ డ్రామా మిస్ కాకుండా.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper