Bandla Ganesh- Puri Jagannath: బండ్ల గణేష్ మైక్ పట్టుకుంటే మంటలే. పవన్ ఫ్యాన్స్ కైతే పూనకాలే. అలాగే వెనుకా ముందు చూసుకోకుండా ఆయన చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతాయి. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆయన పరోక్షంగా చాలా మందిని టార్గెట్ చేశారు. టాలీవుడ్ స్టార్స్ నుండి పూరి సన్నిహితుల వరకు చురకలు అంటించారు. దర్శకుడు పూరి, బండ్ల గణేష్ మంచి మిత్రులు. నిర్మాత అయ్యాక పూరితో ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్ చిత్రాలు నిర్మించారు. ఇద్దరు అమ్మాయిలతో యావరేజ్ గా నిలవగా, టెంపర్ హిట్ కొట్టింది.

టెంపర్ తర్వాత బండ్ల గణేష్ చిత్రాలు నిర్మించలేదు. పూరి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా బండ్ల గణేష్ చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఓపెన్ కామెంట్స్ చేశారు. నాలుగు గోడల మధ్య చెప్పాల్సిన బుద్దులు మైక్ లో పబ్లిక్ గా చెప్పేశాడు. పూరి భార్య లావణ్యను ఆకాశానికి ఎత్తిన బండ్ల, ఛార్మికి మాత్రం షాక్ ఇచ్చినట్లు అనిపించింది. ర్యాంప్ వ్యాంప్ అంటూ బండ్ల గణేష్ అన్న మాటలు ఛార్మి ని ఉద్దేశించేనని అందరూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పూరి దగ్గర వంద రూపాయలు కూడా లేనప్పుడు భార్య లావణ్య వచ్చింది, స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ ర్యాంప్ లు వ్యాంప్ లు వచ్చారు.
Also Read: Puri Jagannadh- Charmi: హీరోయిన్ ఛార్మి వల్ల పూరి జగనాథ్ ఇంట్లో గొడవలు
కుటుంబం తర్వాతే ఎవరైనా. మనం సంపాదన వాళ్ళ కోసమే. అలాగే మనం అప్పులపాలైతే తీర్చేది కూడా వాళ్లే. కాబట్టి కుటుంబమే ముఖ్యం, తర్వాతే ఎవరైనా… అంటూ బండ్ల పరోక్షంగా ఛార్మిపై సెటైర్లు వేశాడు. కొన్నాళ్లుగా పూరి జీవితంలో ఛార్మి భాగమైపోయారు. నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఛార్మి వచ్చాకే పూరి జీవితం తిరగబడిందన్న వాదన ఉంది. పూరి వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న తరుణంలో నటి హేమ.. పూరీని ఛార్మి మబ్బులా కమ్మేసింది, ఆమె పొతే కానీ ఆయనకు హిట్స్ రావని ఓపెన్ కామెంట్ చేసింది.

దర్శక నిర్మాతగా అన్నీ కోల్పోయిన పూరి జగన్నాధ్… ఉన్నవన్నీ ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ మూవీ చేశారు. సొంత నిర్మాణ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కగా రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఆ దెబ్బతో అప్పులు తీరి మళ్ళీ ఇల్లు, కార్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండతో వరుసగా లైగర్, జనగణమన వంటి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్ర విజయాలపై పూరి, ఛార్మి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఛార్మి కోసం పూరి భార్య లావణ్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
Also Read:Lokesh Kanagaraj- Ram Charan: చరణ్ విషయంలో చిరంజీవిపై అపవాదు… తొలగించిన విక్రమ్ దర్శకుడు!