Congress TRS: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్ ఓవర్ ఫుల్ కావడం.. ప్రత్యామ్మాయంగా బీజేపీ బలం సరిపోకపోవడంతో అందరూ పాత ప్రతిపక్షమైన కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు తెలంగాణ అంతటా నాయకత్వ బలం,క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ తెలంగాణ అంతటా ఈ బలం లేరు. అందుకే టీఆర్ఎస్ లో సీట్లు దక్కని వారికి.. అవకాశం రాని వారికి ప్రధాన ఆప్షన్ గా కాంగ్రెస్ కనపడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగి ఇప్పుడు టీఆర్ఎస్ లో ప్రధాన్యం దక్కని వారంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

తాజాగా ప్రజలు ముద్దుగా పిలిచే నేత పీజేఆర్.. బిడ్డ విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి సమంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ సందర్భంగా పీజేఆర్ గురించి రేవంత్ గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ అని.. బస్తీలలో వున్న పేదోళ్లకు దేవుడు అని కొనియాడారు. బస్తీలు నగరాలుగా మారినయని.. ఇతర ప్రాంతాల నుండి బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్లకు పీజేఆర్ అండగా వున్నారన్నారు. లక్షలాది మంది పీజేఆర్ పుణ్యమా అని ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ల కోసమే చివరి వరకు పోరాటం చేసిండు.. పీజేఆర్ సీఎల్పీ నేతగా ఎదిగిండు .. సొంత పార్టీలోనే ప్రజలకోసం గళం విప్పాడని కొనియాడారు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ నేతలకు విడదీయరాని బంధం వుందని గుర్తు చేశారు.
పీజేఆర్ పెంచి పోషించిన వాళ్ళు చాలామంది నాయకులయ్యారని.. అట్లాంటి కుటుంబానికి మనం అండగా ఉండాలని ఆమె కూతురు విజయారెడ్డికి భరోసానిచ్చారు. పేదోళ్లకోసం పెద్దమ్మ గుడి ఉండాలని కట్టించిండని.. మొన్న గ్యాంగ్ రేప్ ఆ గుడి దగ్గరే జరిగిందని..నగరంలో పేదోళ్లకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ముఖచిత్రం మార్చడానికి కేసీఆర్ సర్కార్ పనిచేస్తలేదని.. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున, ప్రజలకోసం పోరాటం చేస్తోందని కొనియాడారు.పీజేఆర్ తరుపున విజయారెడ్డి ముందుంటది.హైదరాబాద్ రూపురేఖలు మార్చే బాధ్యత పీజేఆర్, అంజన్ కుటుంబాలు తీసుకుంటాయని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ లో చేరడం తొందరపాటు నిర్ణయం కాదని విజయారెడ్డి అన్నారు. నాకు ఇచ్చిన అవకాశం ప్రజల కోసమేనని.. రెండు నెలలుగా దేశంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.. జంట నగరాల్లో మహిళలను కాపాడుకోలేకపోతున్నామని.. యువత తప్పుదారి పడుతుందని.. ప్రభుత్వం ప్రజలను ఆశ పెట్టడానికి పథకాలు తెస్తున్న అవి సంతృప్తిగా లేవన్నారు. తెలంగాణ ప్రజల బాగోగులు పక్కన బెట్టి ఎజెండా మార్చుకొని ముందుకు వెళ్తుండడం మంచిగ లేదన్నారు. పదవులు కోసం కాంగ్రెస్ లో చేరలేదుని.. నాన్నగారి ఆశయాలతో ముందుకు వెళ్తాయన్నారు. మా నాన్న ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన పోలేదు.. పార్టీ కోసమే పోరాడారరని.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు పోరాడదమన్నారు.
ఇలా పాతకాపులందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన నేతలను పార్టీలోకి రప్పించి అధికార టీఆర్ఎస్ కే షాకిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
[…] […]