Lokesh Kanagaraj- Ram Charan: ఫార్మ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ చరణ్ తో సినిమాలు చేసేలా చిరంజీవి ఒత్తిడి చేస్తారనే పుకారు పరిశ్రమలో ఉంది. తాజాగా ఇదే తరహా వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. విక్రమ్ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన టేకింగ్ చూసిన చాలా మంది హీరోలు చిత్రాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఫేడ్ అవుట్ ఐపోయారు అనుకుంటున్న దశలో కమల్ హాసన్ కి లోకేష్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. విక్రమ్ ఏకంగా రూ. 400 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి విక్రమ్ యూనిట్ కి తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

Lokesh Kanagaraj- Ram Charan
కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ చిరంజీవి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ మీట్ లో పాల్గొన్నారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ లను కలవడం జరిగింది. అయితే ఈ భేటీలో చిరంజీవి దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి ఓ ప్రపోజల్ పెట్టారట. రామ్ చరణ్ తో మూవీ చేయాల్సిందిగా పట్టుబట్టారట. మీడియా వర్గాల్లో ఈ న్యూస్ జోరుగా ప్రచారమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు.
Also Read: Anchor Uday Bhanu: ఆ హీరో మాటలకు ఉదయభాను ముఖం వాడిపోయింది.. ఏమన్నాడంటే?
చిరంజీవి గారు చరణ్ తో మూవీ చేయాలని నన్ను ఒత్తిడి చేశారని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నాన్సెన్స్. చిరంజీవి గారు నన్ను డిన్నర్ కి ఇన్వైట్ చేయక ముందే చరణ్ నేను ఒకటి రెండు సార్లు కలిశాము. ఇక చిరంజీవి గారి నివాసానికి మేము వచ్చినప్పుడు చరణ్ కూడా లేడు. చరణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకుంటాము… అంటూ వెల్లడించారు. దీంతో చిరంజీవిపై వస్తున్న పుకార్లకు చెక్ చెప్పినట్లయింది.

Lokesh Kanagaraj- Ram Charan
విక్రమ్ సీక్వెల్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడంటూ కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ మూవీలో కమల్ హాసన్ మనవడిగా ఓ చిన్న పిల్లాడిని చూపించారు. విక్రమ్ సీక్వెల్ లో కమల్ మనవడి పాత్ర రామ్ చరణ్ చేస్తారట. విక్రమ్ సీక్వెల్ లో చరణ్ నటించినా లేకున్నా… భవిష్యత్ లో లోకేష్ తో చరణ్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. లోకేష్ నెక్స్ట్ తలపతి విజయ్ తో మూవీ చేస్తున్నారు. అనంతరం విక్రమ్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. కాబట్టి మరో రెండేళ్ల తర్వాతే విక్రమ్ సీక్వెల్ ఉంటుంది. మరోవైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. అనంతరం జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి చిత్రంలో నటిస్తారు.
Also Read:Rajinikanth- Rakshit Shetty: సినిమా చూసి ఆ యంగ్ హీరోకి కాల్ చేసిన రజినీకాంత్!