Homeఅంతర్జాతీయంIndia- China: భారత్‌లో చైనా గూఢాచారులు.. చెక్‌ పెట్టిన మోడీ సర్కార్‌!

India- China: భారత్‌లో చైనా గూఢాచారులు.. చెక్‌ పెట్టిన మోడీ సర్కార్‌!

India- China: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో భారతదేశంతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చైనా తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు తన నిరసనను తెలుపుతూ వస్తోంది. కరోనా, తర్వాత పరిణామాలుతో చైనాతో వ్యాపార లావాదేవీలను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే చైనా యాప్‌లతో మన సమాచారం లీకవుతున్నట్లు గుర్తించి దాదాపు 150కి పైగా చైనా యాప్‌లను నిషేధించింది. అయినా చైనా దొడ్డిదారిన భారత్‌లో తన మార్కెట్‌ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో 400 మంది చార్టెడ్‌ అకౌంటెంట్లను తన బుట్టలో వేసుకుంది.

India- China
China spies

భారతే చైనాకు అతిపెద్ద మార్కెట్‌..
చైనా తయారు చేసే ఉత్పత్తులకు ఏడాది క్రితం వరకు భారతే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అయితే కరోనాతోపాటు చైనా తనయాప్‌లతో చేసిన గూడచర్యంతో భారత్‌ అప్రమత్తమైంది. మరోవైపు సరిహద్దులో ఆక్రమణలు మొదలు పెట్టింది. దీంతో చానాకు చెక్‌పెట్టే చర్యలకే కేంద్రం ఉపక్రమించింది. ఇందులో భాగంగా చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంఖం పెచింది. కొన్నింటిని నిషేధించింది. యాప్‌ల విషయంలో అయితే కఠిన నిర్ణయాలు తీసుకుంది. చాలా యాప్‌లను నిషేధించింది. దీంతో చైనా ఆదాయం ఏడాదిలో భారీగా పడిపోయింది. యాప్‌ల నిషేధం ద్వారానే లక్షల కోట్ల నష్టం జరిగింది.

Also Read: Maharashtra Political Crisis: రాజకీయ అపరిపక్వత.. చీలిపోయిన శివసేన

India- China
India- China

దొడిదారిన మార్కెట్‌ పంచుకునే ప్రయత్నం..
దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వ్యాపార లావాదేవీలు తగ్గిపోతుండడంతో మళ్లీ మార్కెట్‌ పెంచుకునేందుకు చైనా ఈసారి దొడ్డిదారి ఎంచుకుంది. సరిహద్దు విషయంలో తన వక్రబుద్ధి ప్రదర్శించి దెబ్బతిన్న చైనా తాజాగా మార్కెట్‌ విషయంలోనూ భారతీయ చార్టెడ్‌ అకౌంటెట్లను తన బుట్టలో వేసుకుని వ్యాపార అనుమతులు పొందే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో సుమారు 400 మంది చార్టెడ్‌ అకౌంటెట్లు నిబంధనలకు విరుద్ధంగా చైనాకు సహకారం మొదలు పెట్టారు. అక్కడి కంపెనీలను ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు యత్నించారు. వ్యాపార అభివృద్ధికి సహకరించారు. కొంతమంది కంపెనీ సెక్రటరీలు కూడా ఇందులో ఉన్నారు. దీనిని గుర్తించిన అధికారులు సదరు నిబంధనలు ఉల్లంఘించిన చార్టెడ్‌ అకౌంటెంట్లపై చర్యలకు ఉపక్రమించారు.

Also Read:Decline Of The Congress: అయ్యయ్యో “చేతి”లో నేతలు పాయేనే.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా ప్రతిపక్షంలోనే కాంగ్రెస్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular