Puri Jagannadh- Charmi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి హీరోయిజమ్ పరంగా సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకుడు పూరి జగన్నాథ్..ఒక్కే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా గతిని మార్చిన కమర్షియల్ దర్శకుడు ఆయన..అందుకే పూరి జగన్నాథ్ కి ఎన్ని ఫ్లాప్స్ వచినప్పటుకి కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు..వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్ కెరీర్ ని మరోసారి కీలకమైన మలుపు తిప్పిన చిత్రం హీరో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది..ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పాన్ ఇండియా లో లెవెల్ అన్ని ప్రాంతీయ బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్కెట్ మంచి డిమాండ్..ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ హీరో రేంజ్ లో జరుగుతుందట..ఇక పూరి జగన్నాథ్ ఆయన దర్శకత్వం వహించిన జ్యోతి లక్ష్మి సినిమా నుండి ప్రముఖ హీరోయిన్ ఛార్మి తో మంచి సన్నిహిత్య సంబంధం ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా నుండి పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కలిసి జాయింట్ గా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు..వీళ్లిద్దరు కలిసి నిర్మించిన సినిమాలలో కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా తప్ప ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

Puri, Charmi
Also Read: BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు
అయితే వీళ్లిద్దరి పై గతం లో చాలా రూమర్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..పూరి జగన్నాథ్ ఛార్మి ని పెళ్లి చేసుకోబోతున్నారు అని..ఆయన సతీమణి లావణ్య కి త్వరలోనే విడాకులు కూడా ఇవ్వబోతున్నారు అని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి..అంతే కాదు ఛార్మి వల్ల ఇప్పటికి కూడా పూరి జగన్నాథ్ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి అని..లావణ్య గారు ఛార్మి కి ‘మా ఆయన నుండి మర్యాదగా దూరం తప్పుకో’ అని బెదిరింపులు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి..ఈ రూమర్స్ అన్నిటికి పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఇటీవల ఆయన లేటెస్ట్ సినిమా ‘చోర్ బజార్’ విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా యాంకర్ అడగగా సమాధానం చెప్పాడు..ఆయన మాట్లాడుతూ ‘నాన్న గారు చార్మ్ గారు కేవలం ఒక మంచి స్నేహితులు మరియు బిజినెస్ పార్టనర్స్ మాత్రమే..పిచోళ్లు వార్తల కోసం ,TRP కోసం రాయాల్సినవి రాస్తుంటారు ..పుకార్లు పుట్టిస్తుంటారు..వాటిని మేము పట్టించుకోము..అసలు అమ్మ నాన్నలు గొడవ పడే విషయాలు కూడా ఏమి మాకు తెలియవు..ఎంత కష్టాలు వచ్చిన వాళ్ళే అనుభవించారు కానీ..ఆర్ధిక ఇబ్బందులు మా వరుకు తెలియనిచ్చేవారు కాదు..ఇంట్లో ఉంటె కచ్చితంగా ఎదో ఒక్క రోజు వాళ్ళ ఆర్ధిక ఇబ్బందులు మాకు తెలుస్తాయి ఏమో అని బయపడి మమల్ని చిన్నప్పటి నుండే హాస్టల్ లో చేర్పించారు..మేము తిరిగి వచ్చాక అన్ని మారిపోయాయి..మా సొంత ఇల్లు లేదు..కారుని అమ్మేసారు..అప్పులు తీర్చడం కోసం ఉన్న ఆస్తులను మొత్తం తాకట్టు పెట్టేసారు..ఈ విషయాలేవీ కూడా మాకు తెలియవు..నిజంగా వాళ్లిదరు విడిపోవాలి అనుకుంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు విడిపోయాయి ఉండేవారు..ఇన్ని రోజులు ఇంత ప్రేమగా ఉండడం మాత్రం అసాధ్యం’ అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్.

Akash Puri
Also Read: Anchor Uday Bhanu: ఆ హీరో మాటలకు ఉదయభాను ముఖం వాడిపోయింది.. ఏమన్నాడంటే?
Recommended Videos