Homeఎంటర్టైన్మెంట్అరె.. బండ్ల గణేష్ ని డిట్టో దించేశాడుగా !

అరె.. బండ్ల గణేష్ ని డిట్టో దించేశాడుగా !

Bandla Ganesh son Hitesh Naagan bandlaఇండస్ట్రీలో బండ్ల గణేష్ కి ఒక మార్క్ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ నుండి నిర్మాతగా ఎదిగిన నేర్పరి. ముఖ్యంగా హీరోలకు భజన చేయడమే తన జీవిత ఆశయంగా వ్యవహరిస్తుంటాడు బండ్ల గణేష్. మైక్ దొరికితే ఎదురుగా ఏ హీరో ఉంటే, ఆ హీరోని తోపు తురుము వీరుడు, శూరుడు అంటూ హడావుడి చేసే బండ్లని పోలి మరో జూనియర్ బండ్ల ఉంటే ఎలా ఉంటుంది ? వినడానికే ఆసక్తిగా ఉన్నా, అచ్చం బండ్లలానే ఓ కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

పైగా ఆ కుర్రాడిని పరిచయం చేసింది కూడా బండ్ల గణేషే. తాజాగా బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో.. తనలాగే ఉన్న ఒక అబ్బాయి ఫోటో పోస్ట్‌ చేశాడు. అరె.. సేమ్ బండ్ల గణేష్ లానే ఉన్నాడు. ఎవరు ఈ అబ్బాయి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తెగ డౌట్లు ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. అయితే, ఈ ఫోటో మరెవరిదో కాదు, బండ్ల గణేష్ పెద్ద కుమారుడు హితేష్‌ నాగన్‌ బండ్లది. హితేష్ తండ్రి పోలికలతో కనిపిస్తూ.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.

అచ్చుగుద్దినట్లు బండ్ల గణేష్ లా కనిపించడంతో.. హితేష్ సినిమాల్లో రాణించడం ఖాయం అని బండ్ల సన్నిహితులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక హితేష్ ఫోటోని బండ్ల గణేష్ షేర్‌ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్‌కి సగర్వంగా పరిచయం చేస్తూ.. అదిరిపోయే ఫోటోను పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైర‌ల్ అవుతోంది. అయితే, బండ్ల ఫాలోవర్స్ కూడా ఈ ఫోటో బండ్ల గ‌ణేశ్ కుర్రాడిగా ఉన్న‌ప్పుడు దిగిన ఫొటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘మీ అబ్బాయి అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగాడు’ అంటూ ఆ ఫోటోను షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. పవన్ డేట్లు కూడా ఇచ్చాడు కాబట్టి.. కథను సెట్ చేసే పనిలో ఉన్నాడట. ఇక బండ్ల గణేష్.. తన కొడుకును కూడా సినినాల్లోకే తీసుకొస్తాను అంటూ ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper