
రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు తరచూ తమ దృష్టికి వస్తోందని హైకోర్టు పేర్కొంది. 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని హైకోర్టు చూచించింది.