spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna : 64 ఏళ్ళ వయస్సులో లవ్ స్టోరీ చేయబోతున్న బాలకృష్ణ..డైరెక్టర్ ఎవరంటే!

Balakrishna : 64 ఏళ్ళ వయస్సులో లవ్ స్టోరీ చేయబోతున్న బాలకృష్ణ..డైరెక్టర్ ఎవరంటే!

Balakrishna : మన టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీయాలంటే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తర్వాతే ఎవరైనా. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణికం, జానపదం వంటి జానర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పట్లో తియ్యడం లేదు కానీ, పాత రోజుల్లో ఫ్యామిలీ డ్రామాస్ తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టిన చరిత్ర ఆయనది. అలా అన్ని జానర్స్ లో మెప్పించిన బాలయ్య లవ్ స్టోరీ జానర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. అదే విధంగా కామెడీ జానర్ లో కూడా ఆయన ఇది వరకు సినిమాలు చేయలేదు. అసలు బాలయ్య తో ఈ జానర్స్ లో సినిమాలు తీయాలనే ఆలోచన ఎవరికీ రాదేమో. ఎందుకంటే ఆయనకీ ఉన్న మాస్ ఇమేజ్ అలాంటిది. అయితే బాలయ్య ఎలాంటి జానర్ లో అయినా అద్భుతంగా నటించగలడు అని అనేక అందర్భాల్లో రుజువు అయ్యింది.

Also Read : ఆ పూజారి కారణంగా బాలయ్య జీవితం రివర్స్ అయ్యిందా? వెలుగులోకి వచ్చిన నిజాలు!

ముఖ్యంగా ఆయనలో హోస్టింగ్ చేసే టాలెంట్ ఉందని ఎవరైనా ఊహించారా?, అన్ స్టాపబుల్ షోలో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. బాలయ్య లో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మన స్టార్ హీరోలందరూ పలు షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు. అందరికంటే బెస్ట్ హోస్ట్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని బాలయ్య పేరు చెప్పొచ్చు. ఆ రేంజ్ హోస్టింగ్ చేశాడు ఆయన. అలా అన్ స్టాపబుల్ చూసిన తర్వాత బాలయ్య కి సాధ్యం కానిది అంటూ ఏది లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక డైరెక్టర్ బాలయ్య బాబు తో ఒక లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయన బాలయ్య బాబు ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని చెప్పాడట.

స్టోరీ విన్న తర్వాత బాలయ్య ఇలాంటి కథలు మన బాడీ కి సూట్ అవ్వవు, నేను యంగ్ వయస్సులో ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నా అభిమానులు అంగీకరించేవాళ్ళు కాదు, ఇప్పుడు నా వయస్సు 64 ఏళ్ళు, ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే చూస్తారా?, నా మాట విని మంచి మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చెయ్యి అన్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం లవ్ స్టోరీ నే చేద్దామని అంటున్నాడట. ఈ ప్రేమకథకు వయస్సు తో సంబంధం లేదని, బాలయ్య వయస్సు కు తగ్గట్టుగానే స్టోరీ ని డిజైన్ చేసాడని అంటున్నారు. ఇంతకు బాలయ్య కి కథ ని వినిపించిన డైరెక్టర్ మరెవరో కాదు, హరీష్ శంకర్(Harish Shankar) అని టాక్ విన్పిస్తుంది. రీసెంట్ గానే ఆయన బాలయ్య తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగానే ఈ స్టోరీ ని వినిపించి ఉంటాడని అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : బాలకృష్ణ, ప్రభాస్ లపై బెట్టింగ్ యాప్ కేసులు నమోదు!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper