Ajith Kumar : ‘విడాముయార్చి'(Vidaamuyaarchi Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్(Thala Ajith) నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కోసం తమిళ నాడు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత అజిత్ తన మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావడమే. పైగా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా, మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రం అమితాసక్తిని రేపింది. ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ కి తమిళనాడు లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే పది కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ని అధిగమించిన ఈ చిత్రం, తమిళనాడు లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది.
Also Read : ఈ హీరో ఏంటి ఒక్కసారిగా 25 కిలోలు బరువు తగ్గాడు. ఎలా సాధ్యం?
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను నిన్న పూర్తి చేసారు. ఈ చిత్రానికి సెన్సె సభ్యులు UA సర్టిఫికెట్ ని జారీ చేసారు. రన్ టైం దాదాపుగా 140 నిమిషాలు ఉంటుందట. అదే సమయంలో అభ్యంతకరంగా ఉన్నటువంటి రెండు నిమిషాల సన్నివేశాన్ని చిత్రం నుండి తొలగించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా 1 నిమిషం 41 సెకండ్ల సన్నివేశం లో కొన్ని చిన్న మార్పులు చేసారు. ఇక సినిమా టాక్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉందట. రీసెంట్ గా విడుదలైన అజిత్ చిత్రాలలో ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకే ఉందని అంటున్నారు. ఫస్ట్ తో పోలిస్తే కాస్త సెకండ్ హాఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ, ఫ్యాన్స్ కి ఫస్ట్ హాఫ్ తోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టేసిన ఫీలింగ్ వస్తుందట. సెకండ్ హాఫ్ ఎలా ఉన్న బోనస్ అనే టాక్ నడుస్తుంది.
ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష(Trisha Krishnan) నటించగా సునీల్, ప్రసన్న వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఇందులో విలన్ రోల్ లో కనిపించనుంది. గతంలో అజిత్ తో కలిసి ఈమె ‘వాలి’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం విశేషం. పుష్ప 2 వంటి పాన్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ని తీసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదే వాళ్లకు మొట్టమొదటి తమిళ చిత్రం. ఓవరాల్ గా ఔట్పుట్ విషయంలో డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ తో పాటు మూవీ టీం మొత్తం పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నది, మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read : అజిత్ ప్రాణాలకు తెగించి ఆ స్టంట్ చేశాడా..? తన భార్య ఏం చెప్పింది..?