Nandamuri Balakrishna: మన టాలీవుడ్ లో జాతకాలను, జన్మ నక్షత్రాలను తూచా తప్పకుండ అనుసరించే హీరోలలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకడు. దేవుడి మీద విపరీతమైన భక్తి చూపించే బాలయ్య నోటి నుండి 24 గంటలు ఎదో ఒక మంత్రం ఉచ్చరణలో ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రసంగాల్లో కూడా దేవుడి గురించి మాట్లాడకుండా ఉండలేడు. అంతటి దైవ భక్తి గల బాలయ్య, తన కొడుకు విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలయ్య కు ఒక పూజారి ఎన్నో ఏళ్ళ నుండి తన సొంత కుటుంబ సభ్యుడిగా మెలుగుతూ వస్తున్నాడట. ఏ ముఖ్య కార్యక్రమం మొదలు పెట్టాల్సి వచ్చినా, తన పూజారి ని సంప్రదించకుండా మొదలు పెట్టడట. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ క్లోజింగ్ స్టేజికి వచ్చినప్పుడు పూజారి చెప్పిన మాటలను అనుసరించడం వల్లే, ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో పీక్ రేంజ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
Also Read: సందీప్ వంగ తన సినిమాలకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ను వాడటానికి కారణం ఏంటంటే..?
తన ఒక్కగానొక్క కుమారుడు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) వెండితెర అరంగేట్రం విషయం లో కూడా పూజారి చెప్పిన మాటల ప్రకారమే ముందుకు పోతున్నాడట. ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాల్సింది. కానీ ఆయన జాతకం సినిమాలకు అనుకూలంగా లేదని, 30 ఏళ్ళ వయస్సు దాటిన తర్వాత ఎంట్రీ ఇస్తే మంచి ఫలితాలు అందుతాయని చెప్పాడట. పూజారి చెప్పినట్టుగానే మోక్షజ్ఞకు 30 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు ఎదురు చూసి, గత ఏడాదే ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాడు అంటూ అధికారిక ప్రకటన చేసాడు. మోక్షజ్ఞ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసి ఆడియన్స్ అద్భుతమైన సర్ప్రైజ్ ని అందించాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త ఏమిటంటే అసలు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అని.
అయితే మొదటి సినిమా కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ తో ఉంటుందని కొందరు, వెంకీ అట్లూరి తో ఉంటుందని మరికొందరు ప్రచారం చేశారు. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, మోక్షజ్ఞ జాతకం 2027 వ సంవత్సరం వరకు బాగాలేదని బాలయ్య సన్నిహిత పూజారి తెలిపాడట. అందుకే మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ ని వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ వయస్సు ప్రస్తుతం 31 ఏళ్ళు. 2027 అంటే ఆయన వయస్సు 33 ఏళ్లకు చేరుతుంది. సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకొని, అది విడుదల అయ్యేసరికి మోక్షజ్ఞ వయస్సు 35 ఏళ్లకు చేరుతుంది. ఇంత లేట్ వయస్సులో వెండితెర అరంగేట్రం చేస్తున్న ఏకైక స్టార్ హీరో కొడుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కేవలం మోక్షజ్ఞ మాత్రమేనని అభిమానులు అంటున్నారు. ఇది ఆయనకు ప్లస్ అవుతుందా, లేదా మైనస్ అవుతుందా అనేది చూడాలి.