Homeఎంటర్టైన్మెంట్Balayya: రాయలసీమ - కర్ణాటక బోర్డర్ లో బాలయ్య !

Balayya: రాయలసీమ – కర్ణాటక బోర్డర్ లో బాలయ్య !

Balayya : నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమా కథ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కథలో ఫుల్ యాక్షన్ తో పాటు ఓ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. పైగా ఈ చిత్ర కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ కథలో ఎంటర్ […]

Balayya Gopichand MalineniBalayya : నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సినిమా కథ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కథలో ఫుల్ యాక్షన్ తో పాటు ఓ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. పైగా ఈ చిత్ర కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ కథలో ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా హైలైట్ గా ఉంటాయట. మెయిన్ గా వెన్నెల కిశోర్ ట్రాక్ అదిరిపోయేలా ఉంటుందట. అదే విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. మరి బాలయ్య కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే.. మొదటిసారి బాలయ్య ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ లో నటించబోతున్నాడు.

ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో తమిళ విలక్షణ కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని పుకార్లు అయితే వస్తున్నాయి. మరోపక్క బాలయ్యకి విలన్ గా చేయడానికి విజయ్ సేతుపతి అంగీకరించలేదని అంటున్నారు.

అందుకే బాలయ్యకి విలన్ గా మైత్రీ మూవీ మేకర్స్ హీరో మాధవన్ ను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా తేలలేదు, ప్రస్తుతం శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్,

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper