spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి....

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి ‘అఖండ 2’ సినిమాతో అతని జోరు కి కొంతవరకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే తన నట పొటెన్షియాలిటి ని బయటికి తీయాలనే ప్రయత్నంలో బాలయ్య బాబు ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఒక యాక్షన్ ఎపిసోడ్లో బాలయ్య డూప్ లేకుండా స్వయంగా తనే పాల్గొన్నాడు దాంతో ఆయన మజిల్ కు దెబ్బ తగిలింది. డాక్టర్లు మజిల్ కి సర్జరీ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఒక నెల రోజులపాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు మరో నెల 15 రోజుల వరకు ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య చాలా మొండి గా వర్క్ చేస్తుంటాడు.

ఎవరు ఏం చెప్పినా వినడు తను ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోతే ఎలాంటి డూప్ లేకుండా తనే యాక్షన్స్ సన్నివేశాల్లో నటిస్తుంటాడు. కాబట్టి అందుకే బాలయ్యకు ఎక్కువసార్లు ఇంజురీలు అవుతూ ఉంటాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ ఏజ్ లో కూడా డూప్ లేకుండా నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

కానీ ఇలాంటి ఇంజురీలు అయినప్పుడే వాళ్ళ అభిమానులు కూడా కాస్త నిరాశను వ్యక్తం చేస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇలాంటి యాక్షన్స్ సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇకమీదట జాగ్రత్తగా ఉంటే మంచిదని చాలామంది బాలయ్య బాబు సన్నిహితులు తనకు సలహాలు ఇస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే ఇదంతా చూస్తున్న కొంతమంది సినిమా విమర్శకులు మాత్రం 70 ఏళ్ళకి దగ్గర్లో ఉన్న బాలయ్య డూప్ లేకుండా సాహసాలు చేస్తుంటే, టైర్ వన్ హీరోలు మాత్రం 40 సంవత్సరాల వయసులో ఉండే డూప్ లతో ఫైట్లను చేయిస్తున్నారు… బాలయ్య ను చూసి నేర్చుకోండని చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper