
RC15 Movie: దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ సినిమాలంటే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్. ఆయన సినిమాలన్నీ కూడా ఓ బలమైన సందేశాన్ని ఇస్తూ సామాజిక కోణాన్ని సృశిస్తూ ఉంటాయి. అయితే ఎంత బాగా సినిమా తీసినా కూడా ఆయన సినిమాకు పెట్టే ఖర్చు మాత్రం నిర్మాతల గుండెలు గుభేల్ మనేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు అంతగా ఆడకపోవడంతో నిర్మాతలు ఎవరూ ఆయనతో సినిమా చేయడానికి సాహసించడం లేదు. ఇక తమిళంలో కమల్ హాసన్ తో చేస్తున్న ‘భారతీయుడు2’ మూవీని కూడా బడ్జెట్ బాగా పెంచాడని నిర్మాతతో గొడవలు అయ్యి ఆ మూవీని మధ్యలో వదిలేశాడన్న ఆరోపణలు వచ్చాయి.
అందుకే తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీని వదిలేసి తెలుగులో రాంచరణ్ తో మూవీని పట్టాలెక్కించాడు దర్శకుడు శంకర్. ఇక్కడి బడా నిర్మాత దిల్ రాజ్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ 200 కోట్లు దీనికి బడ్జెట్ గా అనుకున్నారు. అది సరిపోదని.. మరింత పెంచాలని భావిస్తున్నట్టు టాక్.
శంకర్ రాసుకున్న కథలో హీరో రాంచరణ్ తేజ్ ను బాగా ఎలివేట్ చేస్తారట.. ఇందులో ఓ ట్రైయిన్ ఎపిసోడ్ అద్భుతంగా తీర్చిదిద్దారని.. ఇందుకు వందలాది మంది ఫైటర్లు, ట్రైన్, ట్రాక్ కావాల్సి ఉందట.. దీనికోసమే భారీగా ఖర్చు చేయనున్నారని టాక్.
సినిమాలో ఒక ఫైట్ కోసమే 20 కోట్ల వరకూ వెచ్చించనున్నారట.. ఇక ముందు ముందు సినిమాకు ఇంక ఎంత ఖర్చు చేస్తారో.? నన్న టాక్ నడుస్తోంది. శంకర్ సినిమాకు నిర్మాతగా చేయాలంటే గుండె ధైర్యం కావాలి. మరి దిల్ రాజు ఈ సినిమా కోసం ఖర్చు ఎంత చేస్తాడన్నది ఆసక్తిగా మారింది.
రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి కియారీ అద్వానీ కథానాయిక. అంజలి, సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ మూవీని దిల్ రాజ్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? సినిమా అటూ ఇటూ అయితే ఏంటి పరిస్థితి అన్న టాక్ సినీ వర్గాల్లో సాగుతోంది.