Ashu Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా లో అషు రెడ్డి అనే పేరు ఎంత వైరల్ టాపిక్ గా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ధర్మేంద్ర అనే వ్యక్తి అషు రెడ్డి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం , తన వద్ద 10 కోట్ల రూపాయిల డబ్బులు తీసుకొని మోసం చేసిందని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయంటూ , ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై అషు రెడ్డి కూడా హై కోర్టు ని ఆశ్రయించి , తన వెర్షన్ వాదన వినకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, ఈ కేసు ని తక్షణమే కొట్టివేయాలంటూ పిటీషన్ వేసింది. అంతే కాదు తనపై కొన్ని మీడియా చానెల్స్ పని గట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారని , అందరిని గుర్తు పెట్టుకున్నానని , వీళ్లపై కేసు ని నమోదు చేస్తున్నాను అంటూ నిన్న ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది.
మరోపక్క ఆమె ధర్మేంద్ర తో మాట్లాడిన ఆడియో రికార్డ్స్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా లో చక్ల్కర్లు కొడుతూ బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె జబర్దస్త్ ఫేమ్ వర్ష నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే టాక్ షో కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఒకరోజు పని మీద నేను బయటకు వెళ్ళినప్పుడు , నా మాజీ లవర్ ని కలిసి చాలా పెద్ద తప్పు చేశాను. అలా కలవడం వాళ్ళ, నేను చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచింది. నేను చేసిన తప్పులకు నన్ను ఎవరైనా అంటే పర్వాలేదు కానీ , నా తల్లిదండ్రులను అపార్ట్మెంట్ లో నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతుంటే చాలా బాధపడుతున్నారు. అది నేను తీసుకోలేకపోతున్నాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఈ నిందలు ఎదురుకోవాల్సి వస్తుంది’ అంటూ ఎమోషనల్ అయ్యింది.