spot_img
Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన సుధీర్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , హీరో గా కూడా సక్సెస్ అయ్యారు. కానీ బుల్లితెర లో వచ్చే అవకాశాలు మాత్రం ఆయన వదులుకోవడం లేదు. ఒకపక్క హీరో గా సినిమాలు చేస్తూనే మరో పక్క బుల్లితెర పై హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఏడాది లో అసలు ఖాళీ నే లేకుండా సుధీర్ కాల్ షీట్స్ మొత్తం నిండిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన ‘సర్కార్’, ‘ఆట’ వంటి షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రతీ శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్స్’ సరికొత్త సీజన్ కి కూడా సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ షో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తో ముందుకు దూసుకువెళ్తోంది. ఈ షో నడుస్తూ ఉండగానే , ఇప్పుడు సుధీర్ కి సంబంధించిన మరో షో ఈ నెల 26 నుండి ప్రారంభం కాబోతుంది. అదే ‘ఫ్యామిలీ స్టార్స్ 2’. గత ఏడాది ఈటీవీ లో ప్రసారమైన ఈ ఎంటర్టైన్మెంట్ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని , ఈ ఏడాది సరికొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా అషు రెడ్డి , స్రవంతి లు కో హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోమో లో సుధీర్ వీళ్ళతో కలిసి చేసిన సందడి హైలైట్ గా నిల్చింది.

ఈ ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ ప్రోమో లో సుధీర్ పులిహోర డైలాగ్స్ వినలేక అషు రెడ్డి ‘అయ్యా.. వదిలేయండి అయ్యా’ అంటూ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయడం చాలా ఫన్నీ గా అనిపించింది. అలా సుధీర్ మార్క్ కామెడీ టైమింగ్ తో పంచులతో ఈ షో ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రతీ ఆదివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ ఎంటర్టైన్మెంట్ షో ప్రసారం కానుంది. మొదటి సీజన్ లాగానే , ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Oktelugu Epaper