Ata Grand Finale: ఈమధ్య కాలం లో జీ తెలుగు ఛానల్ లో మొదలైన ‘ఆట’ డ్యాన్స్ రియాలిటీ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షో కి నిర్మాతగా నిహారిక కొణిదెల వ్యవహరించగా, సుడిగాలి సుధీర్ హోస్ట్ గా , నిహారిక , రాధికా, రఘు మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అదే విధంగా కావ్య శ్రీ , వంశీ ధర్ , విష్ణు ప్రియ మరియు సమీరా భరద్వాజ్ టీం లీడ్స్ గా వ్యవహరించారు. ఈ షో నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అందరికీ అనిపించింది. కానీ అప్పుడే గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఈ ఫినాలే కి పుష్ప, గౌరవ్, ప్రీతీ పట్నాయక్, మరియు అక్షిత చేరుకున్నారు. వీరిలో టైటిల్ గెలిచేది ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారిన అంశం. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులైంది. రేపు జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ కానుంది.
ఈ నలుగురు కూడా టైటిల్ గెలవడానికి అర్హులే. ఎవ్వరూ తక్కువ కాదు , ప్రతీ ఒక్కరు అద్భుతంగా డ్యాన్స్ వెయ్యగలరు , వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నంతసేపు అసలు వీళ్ళ శరీరాల్లో ఎముకలు ఉన్నాయా అని అనిపిస్తాది. ఆ స్థాయిలో డ్యాన్స్ వేస్తారు. వీళ్లంతా సామాన్యులే , గతం లో ఏ షో లోనూ పార్టిసిపేట్ చేయలేదు. కానీ వీళ్లకు కొరియోగ్రఫీ గా పనిచేసే వాళ్ళు మాత్రం , గతంలో ‘ఢీ’ అనే పాపులర్ డ్యాన్స్ షోలో పనిచేసినవాళ్లు. కంటెస్టెంట్స్ ని జానీ మాస్టర్ బృందం ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా తక్కువ ఏమి కాదు. ప్రతీ ఒక్కరికి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టేంత సత్తా ఉంది. నిహారిక కొణిదెల ఇలాంటి అద్భుతమైన టాలెంట్స్ ని కోట్లాది మందికి పరిచయం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు.
ఇక ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆడియన్స్ ఉత్కంఠ వీడలేదు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, పుష్ప ఈ సీజన్ టైటిల్ గెలుచుకొని , భారీ మొత్తం లో క్యాష్ ప్రైజ్ ని సొంతం చేసుకున్నాడని అంటున్నారు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సమయంలో పుష్ప అంత గొప్పగా ఆకట్టుకోలేదు , కానీ ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఇతని టాలెంట్ ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఈ స్థాయిలో డ్యాన్స్ వేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కాబట్టి అతను టైటిల్ గెలవడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే విధంగా సోషల్ మీడియా లో ప్రీతీ పట్నాయక్ , గౌరవ్ లకు కూడా మంచి సపోర్ట్ ఉంది. రేపు , ఎల్లుండి జరగబోయే ఈ సమరంలో ఈ నలుగురి కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ లో ఉండబోతుందని టాక్.