Homeఎంటర్టైన్మెంట్Ashu Reddy Engagement: 'బిగ్ బాస్ 8' టైటిల్ విన్నర్ నిఖిల్ తో అషు...

Ashu Reddy Engagement: ‘బిగ్ బాస్ 8’ టైటిల్ విన్నర్ నిఖిల్ తో అషు రెడ్డి నిశ్చితార్థం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Ashu Reddy Engagement: సోషల్ మీడియా లో ఈమధ్య కాలం లో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సెలబ్రిటీ పేరు అషు రెడ్డి. ధర్మేంద్ర అనే వ్యక్తిని ఈమె మోసం చేసి ఏకంగా 9 కోట్ల రూపాయిలు తీసుకుందని , పెళ్లి చేసుకుంటానని చెప్పి , ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది అంటూ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆధారాలతో సహా కేసు రిజిస్టర్ చేయడం , దానిపై అషు రెడ్డి స్పందిస్తూ , నిజానిజాలు తెలుసుకోకుండా తనపై […]

Ashu Reddy Engagement: సోషల్ మీడియా లో ఈమధ్య కాలం లో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సెలబ్రిటీ పేరు అషు రెడ్డి. ధర్మేంద్ర అనే వ్యక్తిని ఈమె మోసం చేసి ఏకంగా 9 కోట్ల రూపాయిలు తీసుకుందని , పెళ్లి చేసుకుంటానని చెప్పి , ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది అంటూ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆధారాలతో సహా కేసు రిజిస్టర్ చేయడం , దానిపై అషు రెడ్డి స్పందిస్తూ , నిజానిజాలు తెలుసుకోకుండా తనపై ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసిన ప్రతీ ఒక్కరిపై లీగల్ గా చర్యలు తీసుకుంటాను అంటూ బెదిరించడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు , హై కోర్టు లో ఆమె తమ వాదనని వినకుండా పోలీసులు నమోదు చేసిన ee కేసు ని వెంటనే కొట్టేయాలంటూ పిటీషన్ కూడా వేసింది. నిన్న హై కోర్టు ఈ పిటీషన్ ని కొట్టిపారేసింది.

ఇదంతా పక్కన పెడితే నిన్న ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో నిశ్చితార్థం చేసుకున్నట్టు కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలలో కేవలం ఈమె చెయ్యి, వరుడు చెయ్యి మాత్రమే కనిపించింది. వరుడు ఎవరో రివీల్ చెయ్యలేదు. అయితే నేడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఈ సస్పెన్స్ కి తెరదించుతూ పెళ్లి కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. పెళ్ళికొడుకు మరెవరో కాదు, ప్రముఖ సీరియల్ హీరో , బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్. ఒక్కసారిగా ఈ వీడియో ని చూసి సోషల్ మీడియా లో అందరూ షాక్ కి గురయ్యారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది, ఆమె ఆ వీడియో గురించి మాట్లాడుతూ ‘నిన్న మీరు నేను అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూసి నాకు నిశ్చితార్థం అయ్యిందని అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు. ఇది నేను జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ షూటింగ్ లోని ఒక షాట్ మేకింగ్ వీడియో. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే , కంటికి కనిపించేవి అన్నీ నిజం కాదు’ అంటూ లేటెస్ట్ గా తన గురించి సోషల్ మీడియా లో జరిగే ప్రచారాలను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper