Aniruddha Acharya: రేయ్ నేను భక్తులకు యోగినిరా.. రాత్రి అయితే చాలు బోగిని రా.. ఓ సినిమాలో బ్రహ్మానందం చెపుతుంటాడు గుర్తుందా.. అచ్చం ఈ డైలాగు మాదిరిగానే ఈ స్వామీజీ వ్యవహారం కూడా ఉంది. పైగా ఆయన లీలలు.. బాగోతాలు మామూలుగా లేవు. ఆయన వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఆయన పేరు అనిరుద్డా ఆచార్య మహారాజ్. ఈయన అసలు పేరు అనిల్ రామ్ తివారి. పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో. ఈయన తండ్రి పేరు రాంనరేష్ తివారి.. తల్లి పేరు చాయాబాయ్.. ఈయన సంత్ శ్రీ గిరిరాజ్ శాస్త్రి మహారాజు నుంచి ఆధ్యాత్మిక దీక్షను స్వీకరించారు. అప్పటినుంచి శ్రీ రామానుజ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావనంలో వృద్ధ మహిళల కోసం గౌరీ గోపాల్ వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. వందలాది మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ ఆశ్రమానికి వచ్చే పేదలకు ప్రతిరోజు ఉచితంగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఆవుల సంరక్షణ కోసం నిర్మించారు.
తన దగ్గరికి వచ్చే భక్తులకు ఏదైనా రోగాలు సోకితే గోమూత్రం.. ఆవు పేడ వంటి వాటితో తయారుచేసిన ఔషధాలను ఈయన ఇస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ఈయన సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈయనకు అనారోగ్యం సోకింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆయన ఏకంగా చికాగో వెళ్లారు. అక్కడ విలాసవంతమైన విధానంలో చికిత్స పొందడం మొదలుపెట్టారు. ఆయన అక్కడి ఆసుపత్రిలో సహాయకులతో మాట్లాడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
“తన దగ్గరికి వచ్చే భక్తులకు ఆవు మూత్రంతో రూపొందించిన ఔషధాలు ఇస్తారు. ఆవు పేడతో తయారుచేసిన ఔషధాలు ఇస్తారు. కానీ తనకు ఏదైనా వ్యాధి సోకితే విదేశాలకు వెళ్తారు. పైగా అక్కడ విలాసవంతమైన విధానంలో చికిత్స పొందుతారు. ఇటువంటి వ్యక్తులు దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. వీళ్ళ గురించి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి తెలుస్తోంది. లేకపోతే ఏమాత్రం తెలిసేది కాదని” నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి బాబాల అసలు రూపం బయటపడిన తర్వాత భక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు. భక్తులు గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని.. నమ్మితే ఇలా మోసం చేస్తారని నెటిజన్లు చెబుతున్నారు.
తన భక్తులకేమో.. ఆవు పేడ, మూత్రంతో రోగాలు పోతాయని సూచిస్తాడు
ఎలాంటి రోగాలు వచ్చినా ఆ రెండింటితో నయం చేయొచ్చని చెప్తుంటాడు
కానీ.. తాను మాత్రం చికాగోలో విలాసవంతమైన చికిత్స పొందుతున్నాడు
ఇదీ.. స్వయం ప్రకటిత గురువు అనిరుద్ధాచార్య బాగోతం అంటూ విమర్శలు pic.twitter.com/3eXbRGDLky
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 19, 2026