ఎంటర్టైన్మెంట్Animal Trailer Review: వామ్మో రణబీర్ కపూర్ మామూలోడు కాదు.. యానిమల్ ట్రైలర్ అదరగొట్టేశాడు

Animal Trailer Review: వామ్మో రణబీర్ కపూర్ మామూలోడు కాదు.. యానిమల్ ట్రైలర్ అదరగొట్టేశాడు

Animal Trailer Review: రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమా మామూలుగా ఉండదనేలా ఫీల్ ని ఇవ్వడంతో దేశ ప్రజలంతా ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేశాయి. అయితే రా అండ్ రస్టిక్ యాక్షన్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా.. నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ ను సంపాదించి యానిమల్ సినిమా కొత్త రికార్డును సృష్టించింది.

బుధవారం సెన్సార్ పూర్తి చేసుకొని, సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ పొందింది. రన్ టైమ్ కూడా ఆశ్చర్యపోయేలా ఉండడంతో.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో స్క్రీనింగ్ చేయగా చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు చూసి ట్రెమండస్ రివ్యూలు ఇచ్చారు. రణబీర్ కపూర్ విశ్వరూపం చూస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలు, పోస్టులు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఈ ట్రైలర్ కూడా ట్రెండింగ్ లో టాప్ లో దూసుకొని వెళ్తుంది.

ఇంతకు ముందే రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాలో ఏం ఉండబోతుందో చుఛాయగా చెప్పగా యావత్ దేశం దాన్ని థ్రిల్ ఫీలైంది. హాలీవుడ్ జాన్ విక్ టైప్ లో ఈ యానిమల్ తీర్చిదిద్దామని, యాక్షన్ సీన్స్ మరో లెవల్లో ఉంటాయన్నట్టుగా హైప్ తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ట్రైలర్.. టీజర్ ను మించి గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. 3 నిమిషాల 32 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో రణబీర్ ను దర్శకుడు ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ అన్నట్టుగా చూపించారు.

ఓట్ అండ్ ఓట్ యాక్షన్ తో పాటు తండ్రి సెంటిమెంట్ ను బాగా వాడినట్లు తెలుస్తోంది. తండ్రికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కొడుకు పగ తీర్చుకోవడం చుట్టూ కథను నడిపించినట్టుగా ట్రైలర్ ను కట్ చేశారు. ఇక చివరలో వచ్చే గన్ ఫైర్ మాత్రం మరో స్థాయిలో ఉంది. ఖైదీ, కేజీఎఫ్ గున్నులను మించిన గన్నును ఈ సినిమాలో వాడారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చే విధంగా ఈ ట్రైలర్ ఉంది. ఇక సినిమాపై ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు పెంచేశారు మేకర్స్.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే!

Seetha Payanam Collection: ఒకప్పుడు యాక్షన్ హీరో గా సౌత్ ఇండియా లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో అర్జున్(Arjun Sarja). అందరూ ఆయన్ని యాక్షన్ కింగ్...

Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం 'స్పిరిట్'(Spirit Movie), 'కల్కి 2'(Kalki 2 Movie), 'Fauji' చిత్రాలను పూర్తి చేయడం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆయన...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...