Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో మాత్రం తను కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందని సినిమా మేధావులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లందరి కంటే కూడా తను టాప్ పొజిషన్ లో ఉన్నాడు. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో సక్సెస్ లను సాధిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో అంతకు మించిన సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు… ఇక అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ఆగడు సినిమాకి కథ రచయితగా వ్యవహరించాడు. అలాగే దానికి మాటలను కూడా రాశాడు.
సెకండాఫ్ సీన్స్ కి ట్రీట్మెంట్ రాసే క్రమంలో అతనికి కళ్యాణ్ రామ్ నుంచి పటాస్ సినిమా ఆఫర్ రావడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దాంతో శ్రీను వైట్లకి సెకండ్ హాఫ్ వార్మ్ చేయకుండా హ్యాండ్ ఇచ్చాడు. దాంతో శ్రీను వైట్ల కి కొంతవరకు కష్టం వచ్చిందని సీన్స్ ఎలా వేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టుగా రాశారట. ఇక ఆగడు మూవీ రిలీజ్ అయి ప్లాప్ అయింది. అనిల్ రావిపూడి మాత్రం పటాస్ మూవీతో సక్సెస్ ను అందుకున్నాడు.
అప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆగడు సినిమా ప్రస్తావన వచ్చింది. దాంతో అనిల్ అప్పుడు నా పటాస్ మూవీలో చేసినట్టుగా ఆగడు మూవీ ని కూడా ఇన్వెస్టిగేషన్ మెథడ్ లో తీసుకెళ్తే బాగుండేదని శ్రీనువైట్ల కి చెబుదామనుకున్న కానీ చెప్పలేకపోయాయని అన్నాడు.
ఇక ఆ తర్వాత శ్రీనువైట్ల అనిల్ రావిపూడి ని కలిసిప్పుడు నువ్వు నా సినిమాను మధ్యలోనే వదిలేసావు నీ సంగతి చెప్తా అని నవ్వుతూ అనేవాడట. దానికి అనిల్ సైతం నవ్వుకుంటూ అలా చేయడం నా తప్పేనని అనిల్ సమాధానం చెప్పారట. ఇక ఏది ఏమైనా కూడా శ్రీను వైట కొద్దిరోజుల నుంచి సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. మొత్తానికైతే రీసెంట్ గా అతనికి శర్వానంద్ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…