Mahesh Babu Favorite Anchor: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ కూడా క్రియేట్ అవుతోంది. ఇప్పటివరకు ఆయన భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్లందరి తో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగేలా చేశాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మహేష్ బాబుకి ఇప్పటికే చాలా మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయట. వాటిని పక్కన పెడుతున్న మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బయట ఫంక్షన్స్ కి పెద్దగా అటెండ్ అయితే అవ్వడు. ఆయన చాలా రిజర్వుడ్ గా ఉంటాడు. అందువల్లే ఆయన బయట హీరోల సినిమా ఫంక్షన్స్ కి కూడా పెద్దగా అటెండ్ అవ్వడానికి ఇష్టపడడు.
మరి ఇలాంటి సందర్భంలో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను’ అనే ప్రోగ్రాం కి వచ్చిన మహేష్ బాబు కేవలం ఆఫన్వర్ మాత్రమే ఇంటర్వ్యూలో ఉంటానని చెప్పినప్పటికి ప్రదీప్ యాంకరింగ్ కి ఫిదా అయిపోయిన మహేష్ బాబు దాదాపు గంటన్నర పాటు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారట.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటి రోజు వసూళ్లు.. ప్రీమియర్స్ షోస్ లేకపోతే దారుణం!
ఇక ఇప్పుడున్న యాంకర్లలో ప్రదీప్ చేసే యాంకరింగ్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో మహేష్ బాబు చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ గురించి మాట్లాడటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక రీసెంట్ గా ప్రదీప్ సైతం మహేష్ బాబుకి తనకు ఉన్న బాండింగ్ గురించి చెబుతూ ఆయనతోపాటు ఒక ఈవెంట్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు మహేష్ బాబు పక్కన చార్టెడ్ ఫైట్ లో కూర్చొని వెళ్లానని చెప్పాడు. ఇక మొత్తానికైతే యాంకర్ ప్రదీప్ ఇప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఇక మహేష్ బాబు సైతం తన సినిమాలను చూసుకుంటూ చాలా బిజీగా తన కెరీర్ ని కూడా సాగిస్తున్నాడు…