Homeఎంటర్టైన్మెంట్Udaya Bhanu-Jhansi: స్టార్స్ యాంకర్స్ ఉదయభాను-ఝాన్సీలకు ఎక్కడ చెడింది? ఛీట్ చేశారంటూ ఓపెన్ అయిన స్టార్...

Udaya Bhanu-Jhansi: స్టార్స్ యాంకర్స్ ఉదయభాను-ఝాన్సీలకు ఎక్కడ చెడింది? ఛీట్ చేశారంటూ ఓపెన్ అయిన స్టార్ యాంకర్!

Udaya Bhanu-Jhansi: అప్పట్లో టాప్ యాంకర్లల్లో ఒకరిగా వెలిగింది. సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ మధ్య గట్టి పోటీ ఉండేది.నువ్వా నేనా అన్నట్లు ఒకరితో మరొకరు తలపడేవారు. ముఖ్యంగా యాంకర్ ఉదయభాను, ఝాన్సీ మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేది.

Udaya Bhanu-Jhansi: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా రాణించింది. అప్పట్లో టాప్ యాంకర్లల్లో ఒకరిగా వెలిగింది. సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ మధ్య గట్టి పోటీ ఉండేది.నువ్వా నేనా అన్నట్లు ఒకరితో మరొకరు తలపడేవారు. ముఖ్యంగా యాంకర్ ఉదయభాను, ఝాన్సీ మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేది.

వారి మధ్య చాలా విభేదాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.కాగా యాంకర్ ఝాన్సీ ఈ విషయంపై తాజాగా స్పందించారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో వివరించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. నాకు బాగా పొగరని, అసలు మాట్లాడనని ఇప్పటికి కొందరు అనుకుంటారు. కానీ అదంతా నిజం కాదు. డబ్బుల విషయంలో, ఆఫర్ల ఇస్తామని చాలా మంది చాలా మంది మోసం చేశారు.

యాంకరింగ్ చేస్తే, ఈవెంట్ అయిపోయిన కొన్ని నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. యాంకర్ ఉదయభాను, నేను గొడవ పడ్డామని… మా మధ్య ఏదో జరిగిందని కొందరు కావాలనే ప్రచారం చేశారు. కెరీర్ లో ఎంతోమందితో ట్రావెల్ చేస్తాం. కొందరు దగ్గర అవుతారు. కొందరు దూరంగా ఉంటారు. అలాగని వారితో శత్రుత్వం ఉన్నట్లు కాదు. కొంతమందితో సాన్నిహిత్యం ఉంటుంది. కొందరితో పరియం ఉంటుంది.

నాకు ఉదయభానుతో పరిచయం ఉంది. శత్రుత్వం లేదు. సుమతో ఎక్కువగా క్లోజ్ గా ఉండటం, ఉదయభాను తో అంతగా కలవకపోవడంతో జనాల్లోకి అలా వెళ్ళింది. అంతే తప్ప మరేమి లేదు అని ఝాన్సీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఝాన్సీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే .. నటుడు జోగినాయుడు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ధన్య అనే కూతురు ఉంది. పెళ్ళైన ఏడాదికి మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. ప్రస్తుతం ఝాన్సీ సినిమాల్లో నటిస్తోంది.

Related News

Most Popular

Oktelugu Epaper