Srikanth Iyengar : టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు శ్రీకాంత్ అయ్యంగర్. 2013 వ సంవత్సరం లో ‘చమ్మక్ చల్లో’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన శ్రీకాంత్ , ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే అవకాశం అయితే వచ్చింది కానీ , అనుకున్నంత పేరు మాత్రం రాలేదు. అయితే ఆయనకు నటుడిగా మొట్టమొదటిసారి మంచి గుర్తింపు ని తెచ్చి పెట్టిన చిత్రం ‘ప్రతిరోజు పండగే’. ఈ చిత్రం తర్వాత శ్రీకాంత్ అయ్యంగర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఏడాదికి పది నుండి 20 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఏడాది లోనే ఆయన నుండి 5 సినిమాలు విడుదల అయ్యాయి.
అందులో ‘పెద్ది’ చిత్రం కూడా ఒకటి. ఇలా సినిమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్న ఆయన , స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నాడు. ఇదంతా పక్కన పెడితే శ్రీకాంత్ అయ్యంగర్ కి సోషల్ మీడియా ని బాగా ఉపయోగించే అలవాటు ఉంది. కానీ ఆయన ఈ సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియో సంచలనం గా మారింది. ఈ వీడియో లో ఆయన ఒక చేతిలో మందు , ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ఉన్నాడు. ఇదేంటి అని ఆయనతో ఉన్న మహిళ అడగ్గా , ఇంతకు మించిన ఆనందమైన జీవితం ఉంటుందా అని అంటాడు.
శ్రీకాంత్ అయ్యంగర్ కి ఇది వరకే పెళ్లి అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి సోలో లైఫ్ గడుపుతూ వస్తున్న శ్రీకాంత్ , అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి కూడా ఈయన ఇది వరకే అనేక కామెంట్స్ చేసి విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇలా నిత్యం కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసే శ్రీకాంత్ అయ్యంగర్, రాబోయే రోజుల్లో ఇంకెన్ని కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.