spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: నేను వెళ్లిపోతా.. ఏడ్చి.. అరిచి.. బిగ్ బాస్ లో అమర్...

Bigg Boss 7 Telugu: నేను వెళ్లిపోతా.. ఏడ్చి.. అరిచి.. బిగ్ బాస్ లో అమర్ దీప్ రచ్చ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ అంటేనే గొడవలు, లవ్ అని చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. ఒకరు గెలివాలి అంటే మరొకరిని ఓడించక తప్పదు. అందుకోసం గేమ్ పై కసరత్తులు చేయాలి. లేదంటే ఓడిపోవాలి. కొత్త కొత్త స్టాటజీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ చేస్తుంది కూడా అాదే. ఇదిలా ఉంటే వారానికి ఒక కెప్టెన్ ను పెడుతారు బిగ్ బాస్. కానీ ఈ సారి ఆ ఆట ఇప్పుడే మొదలైంది. మరి అది ఎలా ఉందో తెలుసుకుందామా?

బిగ్ బాస్ తెలుగు 7 మొదటి కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగుతుంది.ఈ రేస్ లో బిగ్ బాస్ ఇచ్చిన చివరి టాస్క్ ల్లో గెలిచి గౌతమ్ కృష్ణ ,పల్లవి ప్రశాంత్ ,తేజ ,సందీప్ మాస్టర్ పోటీదారులుగా నిలిచారు. మొత్తం మీద రంగు పడుద్ది టాస్క్ లో విరుచుకుపడి కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ లో ఫస్ట్ కెప్టెన్ కూడా ప్రశాంతే.. టేస్టీ తేజ, సందీప్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. ఎవరి టీషర్ట్ పై తక్కువ రంగు ఉంటుందో వారే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్‏బాస్ చెప్పారు. ఇందులో ప్రశాంత్ తప్ప మిగిలిన ముగ్గురు బలంగా ఉన్నవాళ్లే. కానీ గెలవాలన్న కసితో ఆడిన ప్రశాంత్.. ఒక్కొక్కరిని అల్లాడించేశాడు. అతడిని ఎలాగైనా గెలవకుండా మిగతా ఇంటిసభ్యులు ఎంత ట్రై చేసినా చివరకు సాధించి ఓడించాడు. అయితే ఈ టాస్కులో సందీప్ వర్సెస్ ప్రశాంత్ అన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ప్రశాంత్ కొట్టాడు.. తోశాడంటూ నానా రద్ధాంతం చేశాడు సందీప్. ఇక ఆ తర్వాత శివాజీ వర్సెస్ అమర్ దీప్. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అసలు కెప్టెన్సీ టాస్క్ తో సంబంధం లేని అమర్.. అనవసర విషయాలను తీసుకువస్తూ శివాజీతో గొడవపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‏లో అమర్ బిహేవియర్ ప్రేక్షకులకు కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించింది.

రంగుపడుద్ది రాజా టాస్కు నడుస్తుండగా.. టేస్టీ తేజ ఔట్ అని ప్రియాంక అనౌన్స్ చేసింది. దీంతో శివాజీ ప్రియాంకతో మాట్లాడేందుకు ట్రై చేయగా.. ప్రశాంత్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నావని వాదించాడు అమర్. ప్రశాంత్ గెలుస్తాడన్నా.. నువ్వు కంగారు పడకు అంటూ సెటైర్ వేశాడు అమర్ దీప్. దీంతో చెప్పేది వినకుండా ఏదేదో వాగుతుండడంతో విసుగొచ్చిన శివాజీ ఊరికే కంటెంట్ కోసం మాట్లాడతావ్.. నేను ప్రశాంత్ గురించి మాట్లాడతానని నీకు చెప్పానా అంటూ సీరియస్ అయ్యాడు. చెప్పక్కర్లేదు నాకు తెలుసు.. వాడిని తప్ప మిగిలిన వాళ్లను నువ్వు ఎప్పుడు ఎంకరేజ్ చేశావని అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు అమర్. దీంతో చిరాకొచ్చిన శివాజీ .. అది నీ కర్మ.. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను అంటూ వెళ్లిపోయాడు. వంకరగా పుట్టాను కదా.. నాకు ఏం అర్థం కాదు.. నేను వెళ్లిపోతా.. ఇంత దరిద్రమైన ఆలోచనతో ఉన్న ఇక్కడ బతకలేను. నేనే వెళ్లిపోతా అంటూ అరుస్తూ తిరిగేశాడు.

ఇక చివరకు ప్రశాంత్ గెలిచి కెప్టెన్ అంటూ బిగ్‏బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అమర్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. ముఖానికి రంగు పూసేసుకొని ఓ మూల కూర్చున్నాడు. ప్రియాంకా లేదు ఎవ్వరూ లేరు.. అందరు ఏకమైపోయారు. నాకు ఎవ్వరూ లేరు నేనే ప్రాబ్లమ్ ఇక్కడ అందరికీ…వాడేమో లెటర్ దానం చేసి అమ్మాయికి మసాజ్ చేస్తూ కూర్చున్నాడు. నేను వేస్ట్ అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో ప్రియాంక వచ్చే ఏమైందని అడగ్గా.. నేను వేస్ట్ పీస్.. బీ ఇన్ యూ ఆర్ లిమిట్స్ అంటూ చీదరించుకున్నప్పుడు నాకు కోపం వస్తుంది. వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడలేను అంటూ రగిలిపోయాడు అమర్ . మొత్తానికి టాస్క్ ఓడిపోయామని బాధో లేక ప్రశాంత్ గెలిచాడనే కోపంతో రగిలిపోయాడు అమర్. అయినా చుట్టాలు కాదు, దోస్తులు అంత కన్నా కాదు కానీ ఈ గొడవలు ఏంట్రా బాబు అంటూ ఈ లొల్లి నచ్చని వారు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా ట్రోలర్స్ కి మంచి కంటెంట్ దొరుకుతుంది కూడా.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper