Bigg Boss 7 : సోషల్ మీడియా లో ఒక సామాన్య రైతు బిడ్డగా పాపులారిటీ ని సంపాదించి, బిగ్ బాస్(Big Boss Telugu) లోకి వెళ్ళాలి అనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరికి అనుకున్నది సాధించి, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడమే కాకుండా, టైటిల్ విన్నర్ గా కూడా నిల్చిన వ్యక్తి పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)|. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టక ముందు పల్లవి ప్రశాంత్ పై సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఉండేది. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మొదటి రెండు వారాల్లో ఫుల్ నెగటివిటీ ఉండేది, కానీ రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ తో బోలెడంత సానుభూతి సంపాదించడం తో పాటు, హౌస్ శివాజీ అండ కూడా పల్లవి ప్రశాంత్ కి బాగా కలిసొచ్చింది. ఫలితంగా టైటిల్ విన్నర్ గా నిలిచాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ తానూ ట్రోఫీ కొట్టిన తర్వాత వచ్చే ప్రైజ్ మనీ ని రైతుల కోసం ఉపయోగిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క రైతుకు కూడా డబ్బులు ఇచ్చినట్టు కనిపించలేదు. ఈ కారణం చేత పల్లవి ప్రశాంత్ తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకోవాల్సి వచ్చింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మొదటి నుండి ఇతనికి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ పోస్ట్ పెట్టినా వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ప్రశాంత్ కూరగాయలు అమ్ముకుంటూ కనిపించాడు. ‘రావాలమ్మా రావాలి..తెల్లవారు జామునే వచ్చేసాము..ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు..ఒకసారి మా దగ్గర కొంటె రెండవ సారి ఉచితంగా ఇస్తాము’ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాడు.
పల్లవి ప్రశాంత్ జీవితం ఒకప్పుడు ఇలాగే గడిచింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వీడియో సహజమా, లేకపోతే రీల్స్ కోసం చేశాడా అనే అనుమానం నెటిజెన్స్ లో ఉన్నది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద రేంజ్ కి వెళ్లాడని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ లో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ తో స్టార్ మా ఛానల్ ఏడాది పాటు తమ ఛానల్ లోనే పని చెయ్యాలని ఒప్పందం చేసుకుంటుంది. పల్లవి ప్రశాంత్ తో కూడా అలాంటి ఒప్పందమే చేసుకుంది. కానీ ఎందుకో ఆయన బిగ్ బాస్ తర్వాత స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఒక్క షో లో కూడా కనిపించలేదు. ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ షోలో కనిపిస్తాడని అనుకున్నారు కానీ, అందులో కూడా ఆయన రాలేదు.
Also Read : పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఇదా.. రైతుబిడ్డ ముసుగులో అలాంటి పనులు, ఏకిపారేస్తున్న నెటిజెన్స్!