Bigg Boss Telugu Subhashree Rayaguru : సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు(Subhashree Rayaguru). బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss 7 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె 5 వ వారం లో ఎలిమినేట్ అయ్యింది. చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపిస్తూ , గేమ్స్ కూడా అద్భుతంగా ఆడే శుభశ్రీ ఎలిమినేషన్ పై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. బిగ్ బాస్ లో అన్యాయం జరిగింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు వచ్చే అవకాశం దొరికింది కానీ, బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కారణంగా రాలేకపోయింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ముఖ్యంగా ఈమె డ్యాన్స్ రీల్స్ కి ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. సినిమాల్లో కూడా ఈమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో కూడా ఈమె ఒక కీలక పాత్ర పోషించింది. ఇలా కెరీర్ ముందుకెళ్తున్న సమయంలో రీసెంట్ గా ఈమె ఒక అతనితో నిశ్చితార్థం చేసుకొని కనిపిస్తూ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. అయితే శుభశ్రీ అందం ముందు అతను ఏ మాత్రం సరిపోలేదని,నీకు సరైన జోడీ కాదని, స్కిన్ చాలా డార్క్ గా ఉందని,ఇలా ఎన్నో రకాల కామెంట్స్ చేశారు నెటిజెన్స్. కొంతమంది అయితే పెళ్లి వరకు వెళ్లకుండానే వీళ్ళ మధ్య విడాకులు జరిగింది అంటూ కూడా ప్రచారం చేశారు. అయితే ఈ రూమర్స్ అన్నిటికి శుభశ్రీ రీసెంట్ గానే జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే టాక్ షో లో క్లారిటీ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘చాలా మంది నేను అతన్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంటున్నారు. అతనికంటే డబ్బున్న వ్యక్తులు నాకు జీవితం లో ఎంతోమంది పరిచయం అయ్యారు. ప్రపోజ్ చేశారు కూడా,కానీ నేను అంగీకరించలేదు. నేను అతనిలో ఉన్న మంచి గుణాన్ని చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు కానీ ,అతనితో రిలేషన్ లో ఉన్న ఈ 9 నెలల్లో నేను ఒక్కసారి కూడా ఏడవలేదు. నన్ను ఎప్పుడూ సంతోషంగానే చూసుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియా లో వచ్చే అలాంటి కామెంట్స్ ని చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది శుభశ్రీ. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్ లో కలుసుకున్న వీళ్లిద్దరు, ఆ షూటింగ్ సమయంలో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారట.