Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss 7 Telugu) టైటిల్ విన్నర్ గా అప్పట్లో రైతుబిడ్డ ట్యాగ్ తో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) నిల్చిన సంగతి తెలిసిందే. కేవలం రైతు బిడ్డ అనే సెంటిమెంట్ ని వాడుకొని, గెలిచినా డబ్బు మొత్తాన్ని రైతులకు ఖర్చు చేస్తానని చెప్పి, బయటకు వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయిన వ్యక్తి ఇతను. కేవలం శివాజీ కారణంగానే పల్లవి ప్రశాంత్ అసలు రంగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు బయటపడలేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అప్పట్లో పల్లవి ప్రశాంత్ ప్రతీ చిన్న విషయం లో అమర్ దీప్ ని రెచ్చగొట్టేవాడు, ఆయనకు తోడు శివాజీ(Sivaji) కూడా అమర్ దీప్ ని ప్రతీ చిన్న విషయం లో నెగటివ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. అందుకే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు, అమర్ దీప్(Amardeep Chowdary) రన్నర్ అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని స్టార్ సెలెబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని చాలా కఠినమైన నియమం పెట్టింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది అమాయక యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. స్టార్ సెలబ్రిటీస్ వాటిని ప్రమోట్ చేయడం వల్ల యువకులు ప్రభావితం అవుతున్నారు. అందుకే వీటికి స్వస్తి పలకాలని చెప్పింది. అయితే సోషల్ మీడియా లో ఇలాంటి బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టడం లో ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ ఆరితేరిపోయాడు. రీసెంట్ గానే ఆయన ఈ అంశంపై VC సజ్జనార్ తో చేసిన లైవ్ వీడియో చాట్ సంచలనంగా మారింది. ఇప్పుడు అన్వేష్ పల్లవి ప్రశాంత్ గుట్టు మొత్తం రట్టు చేసే పనిలో పడ్డాడు. ఇతను గతంలో రెండు బెట్టింగ్ యాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని, ఇతన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాకు మెసేజ్ చేశాడని, ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను, దయచేసి నాకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో వేయండి అని అడిగాడని, నేను అలాంటివి ప్రోత్సహించను బ్రదర్ అని చెప్పానని, అతను నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి రైతుల గొప్పదనం తెలియచేసి, ప్రైజ్ మనీ ని రైతుల కోసమే ఖర్చు చేస్తానని చెప్పాడని, కానీ చివరికి బయటకి వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్పిన పనిని చేయడం మానేసి, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ యువత ని చెడగొడుతున్నాడని, ఇతనికి కచ్చితంగా జైలు శిక్ష పడేలా చేస్తానని ఈ సందర్భంగా అన్వేష్ చెప్పుకొచ్చాడు. ఈ కేసు బుక్ అయితే కనీసం రెండు ఏళ్ళు జైలు జీవితం గడపాల్సి వస్తుందని , అందుకు సిద్ధం అవ్వాలంటూ హెచ్చరించాడు. ఆయన మాట్లాడిన ఫుల్ వీడియో ఎక్సక్లూసివ్ గా మీ కోసం.
Also Read : పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపం ఇదా.. రైతుబిడ్డ ముసుగులో అలాంటి పనులు, ఏకిపారేస్తున్న నెటిజెన్స్!