spot_img
Homeఎంటర్టైన్మెంట్‘తగ్గేదే లే’ అంటూ వెనక్కి తగ్గావేందయ్యా !

‘తగ్గేదే లే’ అంటూ వెనక్కి తగ్గావేందయ్యా !

Pushpa
‘తగ్గేదే లే’ అంటూ పుష్ప టీజర్ తో హడావుడి చేసిన అల్లు అర్జున్ మొత్తానికి వెనక్కి తగ్గాడు. మొదట ఈ సినిమాని ఆగస్టు 13న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఎప్పటినుండో సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఇప్పుడు పుష్ప ఆ డేట్ కి విడుదల కావడం లేదు. ‘తగ్గేదే లే’ అంటూ తప్పనిసరి పరిస్థితుల్లో తమ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు పుష్ప టీమ్. సరే.. మరి ‘పుష్ప’ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు. కనీసం దసరాకి అయినా రిలీజ్ చేస్తే బాగుంటుంది అని బన్నీ టీమ్ ప్రపోజల్ పెట్టినా పుష్ప నిర్మాతల నుండి ఇంకా క్లారిటీ రాలేదు.

సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలనే విషయంలో ఇప్పుడే ఒక క్లారిటీకి రాకపోవడమే మంచింది అనేది నిర్మాతల అభిప్రాయం. ఈ కరోనా సెకెండ్ వేవ్ ఎలా ఉంటుంది.. ? ఎన్ని నెలలు పాటు వేదిస్తోందో ఇప్పుడే చెప్పలేము కాబట్టి.. అసలు ఈ ఏడాది రేసులోనే మన సినిమా లేకుండా ఉండటం మంచింది అని పుష్ప నిర్మాతలు ఆలోచన అట. అంటే.. ఈ ఏడాది రేసు నుండి తప్పుకుంటే.. ఇక వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాతలు అనుకుంటున్నారేమో. ఇదే నిజం అయితే.. మిగిలిన పెద్ద సినిమాలు కూడా ఇప్పట్లో రిలీజ్ కానట్లే. ఒక పెద్ద సినిమా వెనక్కి జరిగినా మిగిలిన పెద్ద సినిమాల మేకర్స్ కూడా వరుసగా వెనక్కి తగ్గుతారు.

ఇప్పటికే ఆల్ రెడీ వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ బరిలో ఉన్నాయి. ఇపుడు ఈ రెండికి పోటీగా ‘పుష్ప’ కూడా వస్తే.. థియేటర్ల సమస్య వస్తోంది. పైగా వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఈ భారీ సినిమాలు అన్ని ఇలా పోటీ పడితే.. నష్టపోయేది సినిమా మేకర్సే. అందుకే సుకుమార్ డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసుకుందాం, ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ ను ప్లాన్ చేద్దాం అని అంటున్నాడట. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper