Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: లెనిన్ మూవీకి నాగార్జున వల్లే మైనస్ అవుతుందిగా...

Akhil Akkineni: లెనిన్ మూవీకి నాగార్జున వల్లే మైనస్ అవుతుందిగా…

Akhil Akkineni: వారసత్వం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీ లో రాణిస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. కష్టపడే తత్వం ఉంది ప్రేక్షకులను మెప్పించగలిగే కథలను ఎంచుకొని సక్సెస్ లను సాధించినవాళ్లకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగేశ్వరరావు టాప్ హీరోగా మారాడు. తన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ తన నట వారసులు అయిన […]

Akhil Akkineni: వారసత్వం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీ లో రాణిస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. కష్టపడే తత్వం ఉంది ప్రేక్షకులను మెప్పించగలిగే కథలను ఎంచుకొని సక్సెస్ లను సాధించినవాళ్లకి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగేశ్వరరావు టాప్ హీరోగా మారాడు. తన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ తన నట వారసులు అయిన నాగ చైతన్య, అఖిల్ మాత్రం ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదు. కొంతవరకు నాగచైతన్య బెటర్ అనిపించినప్పటికి అఖిల్ మాత్రం ఎలాంటి సక్సెస్ లను సాధించడం లేదు. ఇక ఈనెల 10 వ తేదీన లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా అతనికి ఎంతవరకు యూజ్ అవుతుంది అఖిల్ ఈ సినిమాతో తను అనుకున్న సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఒక రకంగా చెప్పాలి అంటే అఖిల్ కి నాగార్జున వల్లే మైనస్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జునకి ఉన్న ఇమేజ్ అఖిల్ మీద పడి అఖిల్ నుంచి వచ్చే సినిమాలేవి కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదని, స్టార్ ఫ్యామిలీ స్టేటస్ ఉన్న హీరో కావడం వల్ల తను ఏ సినిమా చేసిన కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన లెనిన్ మూవీ కోసం మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. తన ఇమేజ్ కి తగ్గ కథని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా 200 కోట్ల కు పైన కలెక్షన్స్ రాబడుతుంది అంటూ నిర్మాత నాగ వంశీ సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

అయినప్పటికి నాగార్జున ఇమేజ్ మళ్ళీ అఖిల్ మీద పడి ఈ మూవీకి ఏదైనా మైనస్ అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది… తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper