spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: దీపావళి రోజు క్రాకర్స్ బ్యాన్​ చేయద్దు: సమంత

Samantha: దీపావళి రోజు క్రాకర్స్ బ్యాన్​ చేయద్దు: సమంత

Samantha: దీపావళి అనగానే దీపాల వెలుగులు, పూజలతో పాటు బాణాసంచ కాల్చడం. ఈ పండగ వస్తుందంటే చాలు రెండు మూడు రోజుల ముందు నుంచే వీధుల్లో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పిల్లలకు టపాసులు కాల్చడం అంటే ఎంతో సరదా. అయితే, ఈ టపాసులను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని కొన్ని సంవత్సరాలు వినిపిస్తున్న నినాదం. బ్యాన్​ క్యాకర్స్​ అనే నినాదంతో ప్రభుత్వాలూ ముందుకొస్తున్నాయి. అయితే, కేవలం నిర్దిష్ట సమయంలోనే టపాసులు కాల్చాలని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు కూడా విధించారు. కాగా, ఈ విషయంపై ఈషా ఫౌండేషన్​ స్థాపకులు ఆధ్యాత్మిక గురువు సద్గులు జగ్గీ వాసుదేవ్​ తనదైన శైలిలో స్పందించారు.

“కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం. పండగ అయిపోయినా సరే . ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజుల పాటు కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యంపై ఆందోళన చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి. మీ పిల్లలను కాల్చనివ్వండి. మీ ఆఫీసుకు కారులో కాకుండా… మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్టర్​ వేదికగా విడుదల చేశారు.

అయితే, సద్గురు మాటలకు నటి సమంత మద్దతుగా నిలిచింది. సద్గురు వీడియోను ఇన్​స్టా స్టోరీలో పోస్ట్​ చేస్తూ డోంట్​ బ్యాన్​ క్రాకర్స్​ అంటూ కామెంట్​ చేసింది. గత కొద్ది రోజులుగా సామ్​ సోషల్​ మీడియాలో ఫుల్​ యాక్టీవ్​గా ఉంటోంది. పర్సనల్​తో పాటు ప్రస్తుత పరిస్థితులపైనా స్పందిస్తూ.. తన అభిప్రాయాలను తెలియజేస్తోంది. సామ్ ప్రస్తుతం తన కెరీర్ పై పూర్తి దృష్టి సారించినట్లుగా టాక్. తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper