TRS: ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారు. మనం చేసే తప్పులే మనమీద ప్రభావం చూపుతాయి. ఇది అక్షరాలా సత్యం. స్వయంకృతాపరాధంతోనే కేసీఆర్ తన మీద వ్యతిరేకతను కొనితెచ్చుకున్నారు. ఇన్నాళ్లు జనంలో ఉన్న వ్యతిరేకతను ఇప్పుడు బహిరంగం చేసుకున్నారు. కేసీఆర్ అంటే పనులు కావు మాటలే అని తెలిసేలా చేసుకున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూశారు. ఎంత దిగజారిపోయినా విజయం మాత్రం దక్కలేదు. దీంతో స్థానిక ఎన్నికలను తలపించేలా డబ్బు పంపిణీ చేయడం చూస్తే అందరికి అర్థమైపోయింది.

అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్లుగా ఈటలకు పట్టున్న హుజురాబాద్ లో టీఆర్ఎస్ వృథాగా పోటీ చేసి అభాసుపాలైంది. దీంతో ఈటల స్థాయి మరింత పెరిగింది. ఓటర్ల చతురత చూస్తే అందరికి అర్థమైపోయింది. ఎన్ని వ్యూహాలు పన్నినా చివరకు నిరాశే మిగిలింది. ప్రజాబలం ముందు ఏదీ పనిచేయదని ఇప్పటికైనా తెలుసుకోవాలి. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్న రీతిలో ఎన్నిక కొనసాగడం గమనార్హం.
దళితబంధు పేరుతో అధికార పార్టీ ఎంత హంగామా చేసినా ఈటలపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. హుజురాబాద్ ఎన్నిక బాధ్యతలను కేటీఆర్ కు కాకుండా హరీశ్ రావుకు అప్పగించినప్పుడే అందరికి అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి తప్పనిసరని తేలిపోయింది. కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ ను కాదని హరీశ్ రావు ఎంచుకోవడంలోనే కేసీఆర్ స్థితి అర్థమైపోతోంది. హరీశ్ రాను ను బలిపశువును చేయాలనే ఈ మేరకు నిర్ణయించినట్లు అప్పుడే ఊహాగానాలు వచ్చాయి.
Also Read: Teleangana Politics: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో ఏం జరగబోతుంది..?
డబ్బు పంపిణీ అయితే స్థానిక ఎన్నికలను తలపించేలా చేసి వందలాది కోట్లు ప్రజలకు అందజేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నైతికంగా కూడా ఓటమి పాలైంది. తన పరువును బజారులో వదిలేసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తన మాటలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: Huzurabad By Election Result: వరుసగా ఏడోసారి ఈటల ఎలా గెలిచాడు? అసలు కారణాలేంటి?