Food crisis in China: కరోనా కారణంగా చైనా ప్రపంచ మీడియాలో మారుమోగింది. 2019 డిసెంబర్లో కంటికి కనిపించిన వైరస్ ఈ దేశంలో పుట్టి ఆ తరువాత ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా ప్రారంభ దశలో చైనా రాకపోకలను నిషేధించింది. లాక్డౌన్లను పెట్టింది. కఠినంగా నిబంధనలు పెడుతూ ప్రజలను రోడ్లపైకి రాకుండా చేసింది. అయితే గత కొన్ని రోజులుగా చైనా పేరు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమైనట్లు కనిపిస్తుంది. ప్రజలు కొన్ని రోజులకు సరిపడా నిత్యవసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే అందుకు కారణం మాత్రం చెప్పలేదు. అంటే దేశంలో ముందు ముందు ఆహార సంక్షోభం తలెత్తుతుందని చైనా ముందుగానే తమ దేశ ప్రజలకు హెచ్చరించిందా..? ఈ సంక్షోభం ఇతర దేశాల్లో కూడా ఉంటుందా..?

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇదే సమయంలో ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా దేశాలు కరోనా బారిన నుండి ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. అయితే కరోనా పుట్టినిల్లుగా పేర్కొంటున్న చైనాలో ఈ పరిస్థితి ముందుగానే తలెత్తిందా..? అన్న చర్చ మొదలైంది. అందుకే ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ ప్రకటన కేవలం ఆర్థిక సంక్షోభం తలెత్తడంతోనే చేసిందా..? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా…? అని పరిశీలిస్తే.
‘అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు అనుగుణంగా ప్రజలు నిత్యావసరాలు ఏర్పాటు చేసుకోవాలని’ చైనా ప్రభుత్వం సూచించింది. అయితే కరోనా కారణంగానే ఈ సంక్షోభం ఏర్పడిందని, ఈ ప్రభావం నిత్యావసరాలపై పడడంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని అంటున్నారు. అంతేకాకుండా ధరలు స్థిరంగా ఉండేలా, నిత్యావసరాలు సరఫరాల చేయాలని వాణిస్య మంత్రిత్వ శాఖకు తెలిపింది. అయితే ఈ ప్రకటనతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి.
అయితే చైనా అధికారిక మీడియా ‘ఎకానామిక్ డైలీ’ మాత్రం నిత్యావసరాల విషయంలో ఆందోళన అక్కర్లేదని తెలిపింది. లాక్డౌన్ విధించే ప్రాంతంలో మాత్రం ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలిపింది. దానిని లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీంతో చైనాలో మరోసారి కరోనా సంక్షోభం రానుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దేశంలో 90 కొత్త కేసులు నమోదయ్యాయి. షాంఘై డిస్నిల్యాండ్ ను కనీసం మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. డిస్నిలాండ్ కు వారంతంలో ప్రజలు అధికంగా వస్తుంటారు. అందుకే ప్రభుత్వం మొదట ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇదిలా ఉండగా చైనా ఇలాంటి ప్రకటనలు కొత్తేమీ కాదని అంటున్నారు. చలీకాలం సమీపిస్తున్న తరుణంలో చైనాలో ఆహార ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ముందుకు రారు. ఈ నేపథ్యంలో కూరగాయల సప్లయ్ తగ్గి ధరలు పెరుగుతాయి. అందువల్ల ఈ ప్రకటన చేసిందని కొందరు అంటున్నారు.
కరోనా వైరస్ చైనాలో ప్రారంభమై ప్రపంచ దేశాలకు విస్తరించిన నేపథ్యంలో ఆహార సంక్షభం విషయంలోనూ చైనా ఇతర దేశాల్లో సంక్షోభం సృష్టిస్తుందా..? అని అనుమానాపడుతున్నారు. చైనాపై ఇప్పటికే కొన్ని దేశాలు ఆధారపడినందున దేశంలో నెలకొన్ని ఆహార సంక్షోభం దిగుమతులపై పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే లాక్డౌన్ విధించే నేపథ్యంలో ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో చైనా వింటర్ ఒలంపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీని కంటే ముందనే జీరో ఇన్ఫెక్లన్లకు చేరుకోవాలని చైనా భావిస్తోంది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చూడాలంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.