Actress Jayavani: రాజమౌళి చిత్రాలతో ఫేమస్ అయ్యింది నటి జయవాణి. యమదొంగ మూవీలో యమలోకంలో పాపి రోల్ చేసింది. చిత్రగుప్తుడు ఆమె మీద మనసుపారేసుకుంటాడు. బ్రహ్మానందంతో ఆమెకు చిన్న రొమాంటిక్ సీన్ ఉంటుంది. అలాగే విక్రమార్కుడు మూవీలో బస్తీలోని కంచు లేడీగా కనిపించింది. ‘ఒరేయ్ సత్తిగా బయటకు రారా, పిల్లల మీదంట్రా మీ ప్రతాపాలు’ అని ఆమె చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్. రవితేజతో సిగపట్లు పట్టే మహిళ పాత్రలో సహజంగా నటించి మెప్పించింది.
మదొంగ, విక్రమార్కుడు ఆమెకు బాగా ఫేమ్ తెచ్చాయి. అయితే పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఈ మధ్య అరుదుగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. సడన్ గా ఆమె న్యూడ్ ఫోటోలు ట్విట్టర్ లో దర్శనమిచ్చాయి. జయవాణి అధికారిక ఖాతాలో నగ్న ఫోటోలు షేర్ చేశారు. నేను ఫస్ట్ టైం సూర్పణఖ టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఈ అడల్ట్ కంటెంట్ సిరీస్లో లుక్ కోసం చాలా కష్టపడ్డాను, బరువు తగ్గాను, షేప్ సాధించాను… అంటూ నగ్న ఫోటోలు పోస్ట్ చేసింది.
దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అది వెరిఫైడ్ అకౌంట్ కూడా కావడంతో జయవాణి స్వయంగా తన నగ్న ఫోటోలు పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. వరుస కథనాల నేపథ్యంలో జయవాణి వివరణ ఇచ్చారు. అది నా అకౌంట్ కాదు. నా పేరున ఎవరో ఫేక్ అకౌంట్ మైంటైన్ చేస్తున్నారు. నేను సూర్పణఖ అనే వెబ్ సిరీస్ చేయడం లేదు. ఆ నగ్న ఫోటోలు నావి కాదని అన్నారు.
జయవాణి పేరిట సదరు ట్విట్టర్ అకౌంట్ చాలా కాలంగా ఉంది. జయవాణి పర్సనల్ వీడియోలు కూడా అందులో పోస్ట్ చేశారు. అందుకే జయవాణి అనుకునే అభిమానులు ఫాలో అవుతున్నారు. ఒక్కసారిగా పూర్తి నగ్న ఫోటోలు దర్శనం ఇవ్వడంతో అవాక్కయ్యారు. తాజాగా ఆ అకౌంట్ లో ‘ట్విట్టర్ నుండి నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం అంటూ… ట్వీట్ చేశారు. మొత్తంగా జయవాణి పేరున ఉన్న ట్విట్టర్ అకౌంట్ అందరికీ ఝలక్ ఇచ్చింది.
https://twitter.com/Jayavani_/status/1671748742486319104