Shein India: మూడేళ్ల నిషేధం తర్వాత చైనాకు చెందిన ఆన్‌లైన్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ త్వరలో భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమేరకు భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్‌తో ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఈమేరకు రెండు సంస్థలు ఒప్పందంపై సంతకం చేశారు. షీన్ రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ మార్కెట్‌లలో ఒకదానిని ట్యాప్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా పనిచేస్తుంది.
ఐదు అంశాల్లో అగ్రిమెంట్..
షీన్–రిలయన్స్ రిటైల్ డీల్ ఐదు అంశాల్లో ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో రిటైలర్‌తోపాటు రిలయన్స్ రిటైల్ సోర్సింగ్ సామర్థ్యాలు, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను షీన్ ఉపయోగించవచ్చు .
2008లో స్థాపన..
చైనాలో 2008లో స్థాపించబడిన షీన్, గ్లోబల్ ఫాస్ట్–ఫ్యాషన్ మార్కెట్‌ప్లేస్‌లో వేగంగా అగ్రస్థానాని చేరుకుంది. కస్టమర్‌లకు స్థిరమైన క్లిప్‌లో తిరిగే తక్కువ–ధర సేకరణలను అందిస్తోంది.
షీన్ అమ్మకాలు 2021లో 60% పెరిగి ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. స్వీడిష్ హై–స్ట్రీట్, హెచ్ అండ్ ఎం కంటే వెనుకబడి ఉంది.
సరిహద్దు ఉద్రిక్తతతో నిషేధం..
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత పెరగడంతో 59 యాప్‌లతోపాటు షీన్‌ను జూన్ 2020లో భారతదేశంలో నిషేధించారు. అయితే, అమెజాన్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షీన్ ఉత్పత్తులు ఆన్‌లైన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. షీన్ తన చైనీస్ కనెక్షన్ కారణంగా అమెరికాలో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
12 శాతం పెరిగిన రిలయన్స్ రిటైల్ లాభం..
ఇక రిలయన్స్ రిటైల్ నికర లాభం కూడా 12.9 పెరిగింది. రూ.2,415 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా, రిలయన్స్ ్స రిటైల్ కూడా మార్చి త్రైమాసికంలో 966 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం కౌంట్ 18,040కి చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన దాని స్టోర్‌ల వద్ద ఫుట్‌ఫాల్‌ల సంఖ్య 21.9 కోట్లకు చేరుకుంది. జర్మన్ రిటైలర్ మెట్రో జీఏ భారతీయ నగదు – క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు ఈనెలలో విక్రయించింది.