Homeఎంటర్టైన్మెంట్Peddi overseas business: ఓవర్సీస్ లో హద్దులు దాటిన 'పెద్ది' బిజినెస్..టాక్ తేడా అయితే బయ్యర్...

Peddi overseas business: ఓవర్సీస్ లో హద్దులు దాటిన ‘పెద్ది’ బిజినెస్..టాక్ తేడా అయితే బయ్యర్ కి మిగిలేది బూడిదే!

Peddi overseas business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఏప్రిల్ 30న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన వ్యాపారాన్ని మొదలు పెట్టేశారు నిర్మాతలు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ బాగా పేలడంతో బిజినెస్ ఆఫర్లు అన్ని ప్రాంతాల నుండి భారీ రేంజ్ లోనే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కానీ, ఓవర్సీస్ లో కూడా […]

Peddi overseas business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఏప్రిల్ 30న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన వ్యాపారాన్ని మొదలు పెట్టేశారు నిర్మాతలు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ బాగా పేలడంతో బిజినెస్ ఆఫర్లు అన్ని ప్రాంతాల నుండి భారీ రేంజ్ లోనే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కానీ, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 10 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే 7.5 మిలియన్ డాలర్లకు బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు.

ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే, పెద్ది ఓవర్సీస్ బిజినెస్ 42 కోట్ల రూపాయలకు జరిగింది. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ టాక్ వస్తే అవలీలగా ఓవర్సీస్ నుండి 10 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి, కానీ అంతకు మించి మాత్రం రావడం లేదు. వ్యాపారం ఎవరైనా పెట్టుబడికి కనీసం 20 నుండి 30 శాతం లాభం వచ్చేలా చేస్తారు. అంతే కానీ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే, బయ్యర్ కి లాభం ఉండకపోగా, తిరిగి వడ్డీల రూపం లో నష్టమే మిగులుతుంది. అలాంటిది ‘పెద్ది’ కి ఎందుకు ఇలాంటి బిజినెస్ చేశారు అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ బయ్యర్స్ అంత డబ్బులు పెట్టడానికి మరో కారణం ఉంది. అదేంటంటే బాలీవుడ్ ఆడియన్స్. ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్స్ లో బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరధం పడుతారు అనే నమ్మకం బయ్యర్స్ లో ఉంది.

ఎందుకంటే రామ్ చరణ్ కి మొదటి నుండి బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. #RRR చిత్రం తో ఆ క్రేజ్ వేరే లెవెల్ కి చేరింది. దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ పాట హిందీ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ఆడియన్స్ సపోర్ట్ తో బాహుబలి సిరీస్, #RRR, సలార్, పుష్ప 2 , కల్కి 2898AD వంటి తెలుగు సినిమాలు 15 మిలియన్ డాలర్లను దాటి గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా కల్కి చిత్రం అయితే కేవలం నార్త్ అమెరికా నుండి 20 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘పెద్ది’ కూడా ఆ రేంజ్ గ్రాస్ ని రాబడుతుందనే కచ్చితమైన నమ్మకంతోనే ఈ రేంజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరి ఆ రేంజ్ గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది చూడాలి. పాజిటివ్ టాక్ వస్తే పైన చెప్పినవన్నీ చాలా తేలికగా జరుగుతాయి, ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మాత్రం భారీ నష్టాలను చూడక తప్పదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper