spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika Vijay wedding: శరవేగంగా జరుగుతున్న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి పనులు..రిసెప్షన్ గురించి ఆసక్తికర...

Rashmika Vijay wedding: శరవేగంగా జరుగుతున్న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి పనులు..రిసెప్షన్ గురించి ఆసక్తికర అప్డేట్!

Rashmika Vijay wedding: ఇన్ని రోజులు సోషల్ మీడియా, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగిన ప్రచారాలకు ఎట్టకేలకు తెరదించబోతున్నారు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఒక ఇంట్లో ఉంటున్నారని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. దీనిని ఈ జంట ఏనాడు ఖండించలేదు, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాం అని చెప్పి తప్పించుకునేవాళ్ళు. అయితే ఇక నుండి ఆ అవసరం ఉండేలా అనిపించడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా లో వచ్చిన వార్తలు ప్రకారం గానే ఈ జంట వివాహం, ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటలో జరగబోతుంది. ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రులు ఈ వివావా వేడుకలో పాల్గొనబోతున్నారు. సినీ ఇండస్ట్రీ నుండి కానీ, రాజకీయ రంగం నుండి కానీ ప్రముఖులు ఈ పెళ్ళికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

వాళ్ళందరి కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ రిసెప్షన్ కి సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రతీ ఒక్కరు హాజరు కాబోతున్నారు. ఇకపోతే రాజకీయంగా కూడా విజయ్ దేవరకొండ కి మంచి సర్కిల్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో అటు BRS పార్టీ తో ఆయనకు ఎప్పటి నుండో సన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తో కూడా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. వీళ్ళలో ప్రముఖులందరూ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి రాబోతున్నారు. చాలా గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. పెళ్ళికి వేడుకకు మీడియా కి ఎలాంటి ఆహ్వానం అందే అవకాశాలు లేవు కానీ, వెడ్డింగ్ రిసెప్షన్ కి మాత్రం మీడియా కి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన తొలిసారి ‘గీత గోవిందం’ మూవీ షూటింగ్ సమయంలోనే కలిశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం వంటివి జరిగాయి. వీళ్లిద్దరు కలిసి ‘గీత గోవిందం’ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం లో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చాలా కాలం తర్వాత ‘రణబలి’ అనే చిత్రం చేస్తున్నారు. రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా రష్మిక మందాన వరుస బ్లాక్ బస్టర్స్ తో పీక్ రేంజ్ లో ఉంటే, విజయ్ దేవరకొండ మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. కనీసం ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తాడో లేడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
Oktelugu Epaper