Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu - Rajamouli : మహేష్ బాబు కి 3 నెలల ట్రైనింగ్ క్యాంప్..రాజమౌళి...

Mahesh Babu – Rajamouli : మహేష్ బాబు కి 3 నెలల ట్రైనింగ్ క్యాంప్..రాజమౌళి సినిమా కోసం ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నాడా!

పాన్ వరల్డ్ రేంజ్ లో అన్నీ బాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు, యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తియ్యబోతున్న ఈ ప్రాజెక్ట్ ని  మొత్తం మూడు పార్టులుగా తెరకెక్కిస్తారట, ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని వివరాలు తెలియాలంటే ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే.

Mahesh Babu – Rajamouli : #RRR వంటి పాన్ వరల్డ్  బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు తో పాటుగా ఆయన అభిమానులు సుమారుగా పదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పదేళ్ల క్రితమే ఈ కాంబినేషన్ ఓకే అయ్యింది. కానీ మహేష్ బాబు తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, రాజమౌళి కూడా బాహుబలి సిరీస్ తో బిజీ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.

మొత్తానికి ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆగష్టు 9 వ తారీఖున మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఈ ఏడాది చివరి నుండి, లేదా వచ్చే ఏడాది సమీర్ నుండి కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. అదేమిటంటే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లే ముందు మహేష్ బాబు కి మూడు నెలపాటు యాక్షన్ సన్నివేశాలపై వర్క్ షాప్స్ ని నిర్వహించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారట. ఇది వరకు కూడా రాజమౌళి ఇలాంటి ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాడు కానీ, అవి కేవలం  వారం పది రోజులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా మూడు నెలల ట్రైనింగ్ అంటే ఆయన ఏ రేంజ్ సినిమా తియ్యబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు ఫ్యాన్స్ ఎలాంటి సినిమాని అయితే కావాలని కోరుకున్నారో, అలాంటి సినిమాని తియ్యబోతున్నాడట రాజమౌళి. పాన్ వరల్డ్ రేంజ్ లో అన్నీ బాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు, యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తియ్యబోతున్న ఈ ప్రాజెక్ట్ ని  మొత్తం మూడు పార్టులుగా తెరకెక్కిస్తారట, ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని వివరాలు తెలియాలంటే ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper