spot_img
Homeఎడ్యుకేషన్SSC Exams 2025 : పదో తరగతి పరీక్షల్లో మార్పు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ...

SSC Exams 2025 : పదో తరగతి పరీక్షల్లో మార్పు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

SSC Exams 2025 :  తెలంగాణలోని పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం ఉన్న ఇంటర్నల్‌ మార్కులను విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్షలు జరగగా, 20 ఇంటర్నల్‌ మార్కులు కేటాయించారు. అయితే తాజా నిర్ణయంతో 100 మారు‍్కలకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. మరోవైపు పరీక్ష ఫీజుల చెల్లింపు జరుగుతోంది. డిసెంబర్‌ 5 వరకు ఎలాంటి ఫైన్‌ లేకుండా ఫీజు చెల్లించారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించొచ్చు. ఇక రూ.200 ఫైన్‌తో డిసెంబర్‌ 19 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రూ.500 ఫైన్‌తో డిసెంబర్‌ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

పారదర్శకత లోపించడంతో..
పాఠశాలలు ఇంటర్నల్‌ మార్కులు వేసే అకాశం ఉండడంతో యాజమాన్యాలు ఇష్టానుసారం మార్కులు వేసుకుంటున్నారు. విద్యార్థులు చదువులో వెనుకబడినా 15 పైగా ఇంటర్నల్‌ మార్కులు వేస్తున్నారు. దీంతో జీపీఏలలో తేడా వస్తోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర‍్నల్‌ మార్కులను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత‍్వం నిర్ణయించింది.

ఫీజు ఇలా..
రెగ్యులర్‌ విద్యార్థులకు అన్ని పేపర్లకు కలిపి రూ.125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్లలోపు ఉంటే రూ.110 చెల్లించాలి. మూడు పేపర్ల కన్నా ఎక్కువ ఉంటే రూ.123 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఇక పరీక్ష ఫీజుల చెల్లింపులో ఇబ్బందులను, పాఠశాలలపై భారం తగ్గించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో పరీక్షల ఫీజులు చెల్లించే అవకాశం కల్పించింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే.. విద్యార్థులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు కట్టాలి. గతంలో హెచ్‌ఎంలు లేదా పాఠశాల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా పని భారంగా మారింది. ఈ సమసయలకు చెక్‌ పెట్టేలా వెబసైట్‌లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ తీసుకొచ్చింది. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్‌ అవుతారు. నేరుగా ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెలి‍్లంచిన 24 గంటల్లోపు స్టేటస్‌ అప్‌డేట్‌ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx లింక్‌పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
Oktelugu Epaper