Tollywood singer’s birthday party: టాలీవుడ్ లో ఫోక్ సింగర్ గా పేరుపొందిన ఓ గాయని.. తన జన్మదిన వేడుకలను హైదరాబాద్ శివారులోని చేవెళ్ల ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన అనేకమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
జన్మదిన సందర్భంగా వచ్చిన అతిథులకు భారీగా ఆమె విందు ఇచ్చారు.. మాంసాహార వంటకాలను వడ్డించి తన ఆతిథ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. వచ్చిన అతిధుల కోసం విదేశీ మద్యం, ఇతర మాదకద్రవ్యాలను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ శివారులో జరిగిన ఈ పార్టీకి సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ రిసార్ట్ పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యాన్ని, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి హాజరైన వారిలో కొంతమందిని పరీక్షించగా మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు వెళ్లడైంది. దీంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఫోక్ సాంగ్స్ పాడుతూ.. భక్తి రస గీతాలు ఆలపిస్తూ ఆమె ఇటీవల కాలంలో విశేషమైన ప్రాచుర్యం పొందారు. పైగా గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఆమెకు కీలకమైన పదవి కూడా అప్పగించింది. ఆ పదవిలో ఉన్నప్పుడు ఓ దేవాలయంలో ఆమె చేసిన సాంగ్ షూటింగ్ వివాదానికి కారణమైంది. దీంతో అప్పట్లో ఆమె దీనికి సంబంధించి సంజాయిషీ కడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Read Also: పిల్లలను కనడానికి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? ఏ దేశం ఈ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటోంది?
ఆ వివాదం తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోతాయని అనుకున్నప్పటికీ.. అంతకుమించి అనే స్థాయిలో అవకాశాలు వచ్చాయి. పైగా ఆమె పాడుతున్న పాటలు కూడా విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ స్థాయికి ఎదగడం ఒక రకంగా గర్వకారణమే అయినప్పటికీ.. తన పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడంతో ఒక్కసారి గా ఆమె వార్తల్లో వ్యక్తయ్యారు. అయితే ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీస్తోంది.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ టాలీవుడ్ సింగర్ ఇలాంటి వ్యవహారం ద్వారా విమర్శలు ఎదుర్కోవడంతో.. ఆమె భవితవ్యం ఎలా ఉంటుంది.. అవకాశాలు వస్తాయా.. అనే ప్రచారం జరుగుతోంది.
చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలో వచ్చిన అతిథులు మొత్తం హద్దులు దాటి ప్రవర్తించారని.. భారీగా శబ్దాలు పెట్టుకొని నృత్యాలు చేశారని.. అది స్థానికులకు ఇబ్బందికరంగా మారడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు బృందాలుగా ఆ రిసార్ట్ మీద దాడి చేశారని.. ఆ సమయంలో భారీగా విదేశీ మద్యాన్ని.. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న కొంతమందిని పోలీసులు పరీక్షించగా.. వారి రక్త నమూనాలలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ సింగర్..తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అప్పటికే కేసు నమోదు కావడం.. మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారం కావడంతో సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది.