Allu Arjun Movie NTR : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో మైథలాజికల్ మూవీ ఒకటి తెరకెక్కబోతుంది అనే వార్త ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఈ చిత్రమే మొదలు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ముందుగా ఆయన అట్లీ తో సినిమాని ప్రకటించి త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టాడు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా?, ఉంటే ఎప్పుడు మొదలు అవుతుంది?,ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు సోషల్ మీడియా లో అభిమానుల నుండి ఎదురు అవుతూ వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితంగా ఉండే బన్నీ వాసు వంటి వారు కూడా ఈ ప్రశ్నలకు లేటెస్ట్ ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పలేకపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ చిత్రం ఉండదేమో అని అంతా అనుకున్నారు. నిన్న రాత్రి వాస్తవ నిజం బయటపడింది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ నే,కానీ రీసెంట్ గా స్టోరీ డిస్కషన్స్ కి రమ్మని అల్లు అర్జున్ ని త్రివిక్రమ్ పిలిస్తే, అట్లీ చిత్రం పూర్తి అయ్యాక ఈ సినిమా గురించి ఆలోచిస్తా అని అన్నాడట. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మనసు నొచ్చుకుంది. వెంటనే ఈ ప్రాజెక్ట్ నుండి అల్లు అర్జున్ ని పక్కన పెట్టి, జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి సిద్దమయ్యాడు. వాస్తవానికి ఈ చిత్రం మొదట ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయాలనీ అనుకున్నాడు. కానీ ఆయన కూడా చివరికి సైడ్ అవ్వడం తో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్(Junior NTR) పీఆర్ టీం కూడా అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా మన ఇతఃసాలకు సంబంధించిన స్టోరీస్ లో ఎక్కువ సంస్కృతం లో మాట్లాడాల్సి ఉంటుంది.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
నేటి తరం హీరోలలో ఎన్టీఆర్ కి మించి సంస్కృతం లో డైలాగ్స్ ఎవరు కొట్టగలరు చెప్పండి?, ఈ సినిమాకు ఆయన అయితేనే నూటికి నూరు శాతం న్యాయం చేయగలడు. కార్తికేయ స్వామి గురించి ఎవరికీ తెలియని ఒక అధ్యాయం ని తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం #RRR తర్వాత వెంటనే ప్రారంభం అవ్వాల్సింది. కానీ పెద్ద స్పాన్ ఉన్న సినిమా, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది అనేలోపు ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతుల్లోనే పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘దేవర 2’ లో నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేస్తాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలు కానుంది.