Vangapahad : విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది అంటారు. ఇది ఈ ఊరుకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆ ఊరి పేరు వంగ పహాడ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ గ్రామం. పేరులో పహాడ్ ఉన్నప్పటికీ.. ఈ గ్రామంలో పాడు పనులు జరుగుతుంటాయి.
కొన్ని దశాబ్దల క్రితం ఈ గ్రామంలో పడుపు వృత్తి మొదలైంది. అనివార్యంగా చాలామంది ఆ వృత్తి లోకి వెళ్లిపోయారు. తద్వారా ఈ గ్రామం పేరు గొప్పగా పేరు తెచ్చుకోవలసినచోట.. పాడు వృత్తికి కేంద్రంగా మారిపోయింది. తద్వారా ఈ గ్రామంలో యువకులకు అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతేకాదు, ఇక్కడి అమ్మాయిలను వివాహాలు చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ గ్రామం రూపు రేఖలు మార్చడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.
పడుపు వృత్తిలో ఉన్న వారందరికీ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసింది. యుక్త వయసు అమ్మాయిలకు చదువు ఆవశ్యకతను చెప్పింది. పడుపు వృత్తి వల్ల జరిగే అనర్ధాలను వివరించింది. సుఖ వ్యాధుల బారిన పడ్డవాళ్ళకు చికిత్సలు కూడా అందించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఆ గ్రామంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియోలో వంగపహాడ్ గ్రామం గురించి.. ముఖ్యంగా రాత్రి సమయంలో జరుగుతున్న వ్యవహారాల గురించి అందులో ప్రస్తావించారు. కొన్ని ఇలా ముందు మహిళలు రెచ్చగొట్టే విధంగా వస్త్రధారణ చేసి నిల్చుని ఉన్నారు. వారంతా కూడా విటులను ఆకర్షించే పనిలో ఉన్నారు. అయితే కొంతమంది కక్కుర్తి పడి అక్కడికి వెళ్తే.. కోరుకున్న ” పని” జరగకపోగా.. జేబుకు చిల్లు పడుతుందని స్థానికులు అంటున్నారు. కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని.. విటులను ఆకర్షిస్తున్న మహిళలు.. వారిని రెచ్చగొడుతున్నారని.. ఆ తర్వాత డబ్బులు మొత్తం లాక్కొని బయటకి పంపిస్తున్నారని.. ఎదురు తిరిగితే పోలీస్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ వంగపహాడ్ లో ఆ వృత్తి చేసేవారు మారిపోయారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ వారంతా కూడా అదే పాడు పని చేస్తూ ఉండడం మిగతా వారిలో నిర్వేదం కలిగిస్తోంది.