KCR Illness: మాజీ సీఎం కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కోసం కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ కు ఆయన చేరుకున్నారు. జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యానని, దీంతో విచారణ సమయంలో ఇతరులు ఉండొద్దని కేసీఆర్ కోరారు. ఇందుకు కమిషన్ అంగీకరించి మీడియా, ఇతరులు లేకుండా ప్రశ్నించేందుకు సిద్ధమైంది.