Homeక్రైమ్‌Cyber Crime: రూ.5 నోటు పేరుతో స్కామ్‌.. సైబర్‌ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ

Cyber Crime: రూ.5 నోటు పేరుతో స్కామ్‌.. సైబర్‌ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ

Cyber Crime: సైబర్‌ మోసాలు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియంత్రణకు ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. మోసాలు మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో నేరాలు, మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘మీ దగ్గర రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు ఇస్తామ్‌‘ అని ఫోన్‌ కాల్స్‌ ద్వారా నమ్మిస్తూ, ప్రాసెసింగ్‌ ఫీజుగా ముందస్తు చెల్లింపు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తర్వాత ఏపీకే ఫైళ్లు పంపి డౌన్‌లోడ్‌ చేయమని చెప్పి ఖాతాలో డబ్బులు చోరీ చేస్తున్నారు. స్కామ్‌ […]

Cyber Crime: సైబర్‌ మోసాలు దేశంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియంత్రణకు ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. మోసాలు మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో నేరాలు, మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘మీ దగ్గర రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు ఇస్తామ్‌‘ అని ఫోన్‌ కాల్స్‌ ద్వారా నమ్మిస్తూ, ప్రాసెసింగ్‌ ఫీజుగా ముందస్తు చెల్లింపు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తర్వాత ఏపీకే ఫైళ్లు పంపి డౌన్‌లోడ్‌ చేయమని చెప్పి ఖాతాలో డబ్బులు చోరీ చేస్తున్నారు.

స్కామ్‌ ఎలా పని చేస్తుంది..
కాలర్లు ‘రూ.5 నోటు అరుదు, అది చూపితే భారీగా డబ్బులు ఇస్తాం’ అని ఆకర్షిస్తున్నారు. మ్మినవారు ఫొటోలు పంపితే, ‘వెరిఫికేషన్‌ ఫీజు‘ పేరుతో యూపీఐ లేదా బ్యాంక్‌ డీటెయిల్స్‌ తీసుకుంటున్నారు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. తర్వాత ఏపీకే లింకులు పంపుతున్నారు. క్లిక్‌ చేస్తే డేటా థైఫ్ట్‌ లేదా మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది.

ఎలా పని చేస్తుంది ఈ ట్రిక్‌?
పాత నోట్ల అరుదైనవి గురించి ప్రజల్లో ఉన్న ఆసక్తి, ఆర్థిక లాభం పేరుతో దోపిడీ చేస్తున్నారు. డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు సులభంగా ఉండటం వల్ల మోసం త్వరగా సాధ్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉండటం మరింత సులభం చేస్తోంది.

పోలీసుల సూచనలు..
అన్‌ నోట్‌ నంబర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తే పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఫీజు, డిపాజిట్‌ పేర్లతో డబ్బు డిమాండ్‌ చేస్తే నమ్మవద్దు అని పేర్కొంటున్నారు. ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్‌ చేయవద్దని సూచిస్తున్నారు. అధికారిక యాప్‌ స్టోర్లు మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటున్నారు. సందేహాస్పద కాల్స్‌ వస్తే 1930 (సైబర్‌ క్రై మ్‌ హెల్ప్‌లైన్‌)కు ఫార్వార్డ్‌ చేయాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌ డీటెయిల్స్‌ ఎవరితోనూ షేర్‌ చేయవద్దని తెలిపారు.

ఇలాంటి స్కామ్‌లు డబ్బు కోల్పోవడంతోపాటు గుర్తింపు దొంగతనాలకు దారి తీస్తాయి. 2026లో సైబర్‌ క్రై మ్‌ కేసులు రికార్డు స్థాయి చేరుతున్నాయి. ప్రజల అవగాహన లేకపోతే నష్టాలు మరింత పెరుగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper