Homeక్రైమ్‌Hybrid Cyber Fraud: హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. జేబుకి తెలియకుండా పర్స్ కొట్టేసే పన్నాగం..

Hybrid Cyber Fraud: హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. జేబుకి తెలియకుండా పర్స్ కొట్టేసే పన్నాగం..

Hybrid Cyber Fraud: అదేదో సినిమాలో “జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేస్తాడు” అని డైలాగ్ ఉంటుంది.. గుర్తుందా.. సేమ్ అచ్చం అలానే ఈ మోసగాళ్లు చేస్తున్న మోసం ఉంది. మామూలుగా అయితే దొంగలు ఎక్కడో ఒకచోట దొరికిపోతుంటారు. కానీ వీరు దొరికిపోరు. దొరికిపోయే అవకాశం కూడా లేదు. నిండా మునిగిపోయిన తర్వాత గాని తెలియదు మోసపోయామని.. హైదరాబాద్ సిపి సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలను అవేర్నెస్ చేసే కార్యక్రమాలను ఆయన చేపడుతూ […]

Hybrid Cyber Fraud: అదేదో సినిమాలో “జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేస్తాడు” అని డైలాగ్ ఉంటుంది.. గుర్తుందా.. సేమ్ అచ్చం అలానే ఈ మోసగాళ్లు చేస్తున్న మోసం ఉంది. మామూలుగా అయితే దొంగలు ఎక్కడో ఒకచోట దొరికిపోతుంటారు. కానీ వీరు దొరికిపోరు. దొరికిపోయే అవకాశం కూడా లేదు. నిండా మునిగిపోయిన తర్వాత గాని తెలియదు మోసపోయామని..

హైదరాబాద్ సిపి సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలను అవేర్నెస్ చేసే కార్యక్రమాలను ఆయన చేపడుతూ ఉంటారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఆయన తనవంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన కొంతమంది దొంగల్ని పట్టుకున్నారు. వాస్తవానికి వారు మామూలు దొంగలు కాదు. కాకలు తీరిన సైబర్ నేరగాళ్లు. ఇంతకీ వాళ్ళు చేసిన సైబర్ మోసం ఏంటంటే..

ఈ దొంగలు మామూలు వాళ్ళు కాదు. పైకి చూస్తే జేబు దొంగతనాలు చేసే వాళ్ళ మాదిరిగా కనిపిస్తుంటారు. కానీ ఆ తర్వాతే వారు తమ అసలు రూపాన్ని చూపిస్తారు. తామచేసిన దొంగతనాలకు ఆధునికమైన సైబర్ నేరాలను జోడిస్తారు. అమాయకులైన ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. దీనికి వారు పెట్టిన పేరు హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్. ఈ దొంగలు సీనియర్ సిటిజన్లను.. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటారు. వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతుంటారు.. బస్టాండ్.. ప్రతి ఉన్న ప్రాంతాలలో ప్రయాణికులు తమ ఫోన్ లను అన్లాక్ చేసే సమయంలో పిన్ లేదా ప్యాటర్న్ జాగ్రత్తగా గమనిస్తారు.. ఆ తర్వాత ఆ ఫోన్లను చోరీ చేస్తుంటారు. ఒకవేళ లాక్ గనుక తెలియకపోతే బాధితులు ఫోన్ చేసినప్పుడు.. మేము బస్సులో కండక్టర్లుగా పనిచేస్తుంటామని.. ఫోన్ ఇచ్చేస్తుంటామని చెబుతుంటారు. లేదా ఓనర్ వెరిఫికేషన్ పేరుతో మాయమాటలు చెబుతుంటారు. స్క్రీన్ పాస్వర్డ్ రాబడుతుంటారు. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ.. లేదా నోట్స్ యాప్ లలో దాచుకున్న డెబిట్ కార్డులు లేదా ఆధార్ లేదా పాన్ వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆ దొంగిలించిన ఫోన్లలో ఉన్న సిమ్ కార్డుల ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ లను రీసెట్ చేస్తారు. నిధులను తమ ఖాతాలకు మళ్ళిస్తారు. ఆన్లైన్ గేమింగ్ యాప్స్ లేదా మ్యూల్ ఖాతాలకు పంపిస్తారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తరహా నేరాలకు బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెబితే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్క్రీన్ లాక్ పిన్ లేదా ఓటీపీలు చెప్పకూడదు. ముఖ్యంగా ఫోన్ గ్యాలరీలో ఏటీఎం కార్డులు బ్యాంకు పాస్బుక్ లేదా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఫోటోలను స్టోర్ తీసుకోకూడదు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును.. బ్యాంకు యూపీఐ సేవలను వెంటనే బ్లాక్ చేయించాలి..ceir.gov.in పోర్టల్ లో ఫోన్ బ్లాక్ చేయించాలి. ఒకవేళ సైబర్ నేరం జరిగినట్టు అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి. లేదా cyber crime.gov.in లో కంప్లైంట్ చేయాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper