Homeక్రైమ్‌Madhya Pradesh: నమ్మి వచ్చిన ప్రియురాలిపై దారుణం. . ఆపై ఆత్మ కోసం క్షుద్ర పూజలు..

Madhya Pradesh: నమ్మి వచ్చిన ప్రియురాలిపై దారుణం. . ఆపై ఆత్మ కోసం క్షుద్ర పూజలు..

Madhya Pradesh: ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రతిది కూడా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇప్పటికాలం మాత్రమే కాదు.. భవిష్యత్తును కూడా ముందుగానే అంచనా వేయగలుగుతున్నాం. ఒక రకంగా మనం పీల్చే గాలి నుంచి మొదలుపెడితే తినే తిండి వరకు.. ఉండే నివాసం నుంచి మొదలు పెడితే విహరించే గగనం వరకు ప్రతి దాంట్లో ఏం జరుగుతుందో ముందుగానే పసిగట్టగలుగుతున్నాం. ఇంతటి కాలంలో మనుషులు జీవనం సాగిస్తుంటే.. కొందరు మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించేవారు చదువు […]

Madhya Pradesh: ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ప్రతిది కూడా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇప్పటికాలం మాత్రమే కాదు.. భవిష్యత్తును కూడా ముందుగానే అంచనా వేయగలుగుతున్నాం. ఒక రకంగా మనం పీల్చే గాలి నుంచి మొదలుపెడితే తినే తిండి వరకు.. ఉండే నివాసం నుంచి మొదలు పెడితే విహరించే గగనం వరకు ప్రతి దాంట్లో ఏం జరుగుతుందో ముందుగానే పసిగట్టగలుగుతున్నాం.

ఇంతటి కాలంలో మనుషులు జీవనం సాగిస్తుంటే.. కొందరు మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించేవారు చదువు లేని వారు కాదు.. ఉన్నత చదువులు చదివిన వారు. వారంతా దారుణమైన పనులు చేపడుతున్నారు. అంతేకాదు, సమాజంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇటువంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో 24 సంవత్సరాల యువతీ ఎంబీఏ చదువుతోంది. ఈమె ఇటీవల తన స్నేహితుల పుట్టినరోజు వేడుకకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. రాత్రి 11 గంటలకు వస్తానని ముందుగానే చెప్పడం తో కుటుంబ సభ్యులు అప్పటిదాకా ఆమె కోసం ఎదురు చూశారు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి ఫోన్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూప్ లోకి దారుణమైన వీడియో ఒకటి పోస్ట్ అయింది. ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి రావడంతో ఆ వీడియోను డిలీట్ చేసింది. ఆ వీడియోలో ఆ యువతి తో పాటు మరొక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి పేరు పీయూష్. అతడు కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కొద్దిరోజులుగా పీయూష్ కూడా పరారీలో ఉన్నాడు.

ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పీయూష్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దానికి అతడు ఒప్పుకోవడం లేదు. పెళ్లి విషయంలో ఇటీవల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పీయూష్ ఆవేశం తట్టుకోలేక ఆమె గొంతు నులిమాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం అతడు మహారాష్ట్రలోని పన్వెల్ అనే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ ఒక హోటల్లో ఉంటూ యూట్యూబ్ చూసేవాడు.. “ఆత్మలను ఎలా పిలవాలి” .. అనే అంశం మీద తీవ్రంగా సెర్చ్ చేశాడు.. అనంతరం కుంకుమ.. పసుపు.. గాజులు తీసుకొచ్చాడు. తాంత్రిక పూజలు నిర్వహించాడు. చనిపోయిన తన ప్రియురాలి ఆత్మతో సంభాషించాలని అతడు తీవ్రంగా ప్రయత్నించాడు.

పీయూష్ ఇండోర్ నగరంలోని ఓ ప్రాంతంలో అద్దెకు ఉండేవాడు. తన ప్రియురాలిని నిత్యం అక్కడికి పిలిపించుకునేవాడు. ఆమెను చంపిన తర్వాత మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఇంటి యజమానులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గది తలుపులు పగలగొట్టారు. అందులో ఒక యువతి మృతదేహం నగ్నంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పీయూష్ ఆమెను అంతం చేశాడని.. పోలీసులు ఆధారాల ద్వారా సేకరించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper