Bhavani Mandi Railway Station: భారతీయ రైల్వే వ్యవస్థ విస్తారమైనది. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి.. గూడ్స్ రవాణా, ప్రయాణికుల చేరవేత ద్వారా భారతీయ రైల్వే శాఖ దండిగా సంపాదిస్తున్నది. వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఇటీవల కాలంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో రైళ్లను ప్రవేశపెట్టింది. తద్వారా విస్తారంగా సేవలు అందిస్తూ ప్రముఖమైన పేరును సంపాదించుకుంటున్నది.
భారతీయ రైల్వే ఎంత విశిష్టమైనదో.. అదే స్థాయిలో ప్రత్యేకమైనది. భారతీయ రైల్వే వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలు ఆశ్చర్యంగా.. అద్భుతంగానూ కనిపిస్తాయి. అలాంటిదే ఈ విషయం కూడా. భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైల్వే స్టేషన్ అత్యంత ప్రత్యేకమైనది. పైగా ఈ స్టేషన్ కు ఎంత చరిత్ర ఉంది. ఆ చరిత్రే ఈ రైల్వే స్టేషన్ ను ప్రముఖంగా ఉంచుతున్నది.
Also Read: ఉద్యోగానికి పనికిరావని కేఎఫ్ సీ గెంటేసింది.. సీన్ కట్ చేస్తే..500 బిలియన్ డాలర్లకు ఎంపైరర్ అతడు!
రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లాలో భవాని మండి పేరుతో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వేస్టేషన్లో ఏ రైలైనా సరే ఒకేసారి రెండు వేరువేరు రాష్ట్రాలలో ఆగి ఉండాలి. కొన్ని సందర్భాలలో ఈ రైలుకు సంబంధించిన ఇంజన్ ఒక రాష్ట్రంలో ఆగితే.. దాని బోగీలు వేరే రాష్ట్రంలో ఆగుతాయి. భవాని మండి రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ – రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ స్టేషన్లో రైలు టికెట్లు బుక్ చేసుకోవాలంటే మధ్యప్రదేశ్లో నిలబడాలి. టికెట్లు ఇచ్చే వారు మాత్రం రాజస్థాన్లో ఉంటారు. ఈ లెక్కన క్యూ లైన్, టికెట్ కౌంటర్లు వేరువేరు రాష్ట్రాలలో ఉంటాయి. రైల్వే స్టేషన్ తో పాటు, ఈ గ్రామంలో కొన్ని గృహాలు కూడా ఇలాగే రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఉదాహరణకు ఒక ఇల్లు ఒక రాష్ట్రంలో ఉంటే.. ఇల్లు వాకిలి మరో రాష్ట్రంలో ఉంటుంది. వారు ఇంటి నుంచి బయటికి వచ్చారంటే ఒక రాష్ట్రాన్ని దాటి.. మరొక రాష్ట్రాన్ని వచ్చినట్టే.. చాలామంది తమ ఇంటి నుంచి బయటికి వచ్చి.. పక్క రాష్ట్రంలో ఉన్న తమ వాకిళ్లను శుభ్రం చేసుకుంటారు. చదువుతుంటే.. వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. భారత రైల్వే వ్యవస్థలో ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది.. గతంలో ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ను నిర్మించడానికి రైల్వే శాఖ ముందుకు రాలేదు. వేరే ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలనుకుంది. ఆ ప్రాంత రైల్వే స్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో.. భవాని మండి ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మించాల్సి వచ్చింది.. పైగా అది రెండు రాష్ట్రాల పరిధిలో ఉండడంతో.. ఒక్కసారిగా ప్రముఖంగా మారిపోయింది. ఈ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు ఇటీవల కాలంలో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏకకాలంలో రెండు రాష్ట్రాలలో ప్రయాణిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు.