Madhya Pradesh: అది సమాధుల గది. భయానకమైన చీకటి.. ఆ ప్రాంతంలో మానవత్వం సిగ్గుతో తలదించుకొనే దారుణం జరిగింది. ఇప్పుడు మాత్రమే కాదు అనేక పర్యాయాలు అక్కడ దారుణాలు జరుగుతున్నా.. ఇటీవల వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ లో గతంలో ఈ దురాచారం ఉండేది. ఇప్పుడు అది భారతదేశానికి వ్యాపించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. చరిత్ర పుటల్లో మాత్రమే వినిపించిన ఆ దారుణం.. మనదేశంలో జరగడం కలకలం రేపుతోంది.
శ్మశాన వాటికలో ఆడ శ*వాలను వెలికి తీసి.. వాటిపై అఘాయిత్యానికి పాల్పడటం.. ఇక్కడి బడా కబరిస్తాన్ ప్రాంతంలో నగ్నసత్యంగా మారింది. ఈనెల 21వ తేదీన కొంతమంది కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇటీవల ఖననం చేసిన మహిళా బంధువుల సమాధుల వద్దకు చేరుకున్నారు. వారికి కర్మలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా.. అక్కడ దృశ్యాలు గుండెల్లో భయాన్ని కలిగించాయి. కళ్ళల్లో నీరుని తెప్పించాయి. పట్టరాని ఆగ్రహాన్ని వారిలో కలిగించాయి. వారు ఖననం చేసిన మృతదేహాల సమాధుల పై ఫలకలు తొలగించి ఉన్నాయి. సమాధులు తెరిచి ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలోనూ ఇదే విధమైన గుర్తులు కనిపించాయి. ఆ దృశ్యాలు కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను కలిగించాయి. ఈ దృశ్యాలు చూసిన శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో..శ్మశాన వాటికలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో పుటేజీని చూశారు. అందులో ఓ వ్యక్తి నగ్నంగా తిరుగుతూ ఉండడం కనిపించింది. అతడి పేరు ఆయుబ్.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ మొదలుపెట్టారు. అతను చెప్పిన నిజాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేశాయి.. అతడు రాత్రిపూట నగ్నంగా శ్మశాన వాటికలోకి వెళ్లేవాడు. మహిళల సమాధులను తవ్వేవాడు. శవాలను బయటికి తీసి దారుణమైన పనులు చేసేవాడు. ఇది కేవలం మానసిక వికృత క్రీడ మాత్రమే కాదు.. అంతకు మించిన పైశాచికం. తినే పద్యంలో అక్కడి ముస్లింలు రగిలిపోయారు.. నరరూప రాక్షసుడు, ముండ్వాడ నివాసి ఆయుబ్ ఖాన్ ను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాల సేకరణ కోసం అతడిని శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. అతడు చూపించిన ఆధారాలను సేకరించారు. అక్కడే పంచనామా కూడా పూర్తి చేశారు.
ఆయుబ్ ను తిరిగి శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్తుండగా ముస్లింలు శ్మశాన వాటిక ప్రధాన ద్వారం వద్ద గుంపుగా ఏర్పడ్డారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ నరురూప రాక్షసుడిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. సమాజానికి ద్రోహం చేసే ఏ ఒక్క వ్యక్తికి ఈ భూమ్మీద బతికే హక్కు లేదని నినాదాలు చేశారు. పైగా ఇదంతా ఎందుకు చేశావని ఆయుబ్ ను పోలీసులు ప్రశ్నిస్తే..” నాకు లైంగిక శక్తిని పెంచుకోవడం చాలా ఇష్టం. అందువల్లే ఈ పని చేశాను. పైగా ఈ పని చేస్తుంటే నాలో తీవ్రమైన ఉద్రేకం కలుగుతోంది ఉద్వేగం పెరుగుతోంది. ఆ సమయంలో నాకు విపరీతమైన శక్తి వచ్చినట్టు అనిపిస్తోందని” చెప్పడం విశేషం. ఇంతటి మానసిక వికృతమైన సమస్యతో బాధపడుతున్న ఇతడిని ఉరి తీసినా తప్పులేదని అక్కడి ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం.
खंडवा कब्रिस्तान में कब्रों के साथ छेड़छाड़ की ये पहली घटना नहीं है पूर्व में भी कई बार ऐसी वारदात हो चुकी है। तंत्र क्रिया की आशंका और लोगों की धार्मिक भावनाओं से खिलवाड़ गंभीर अपराध है। प्रशासन को तत्काल कार्रवाई करनी चाहिए।@CMMadhyaPradesh @DGP_MP @ChouhanShivraj pic.twitter.com/MBI7LplYqy
— Ilyas (@Ilyas_SK_31) September 22, 2025