Indian marriage system : మన దేశ వివాహ వ్యవస్థ చాలా బలమైనది. అందువల్లే వసుదైక అనే ఆర్యోక్తి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన దేశ వ్యవస్థ కాస్త ఇబ్బందులకు గురవుతున్నది. పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇటీవల కాలంలో పెరిగిపోతున్నది. ఒకప్పుడు ఇటువంటి సంప్రదాయం కేవలం సెలబ్రిటీల జీవితాలలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సామాన్య కుటుంబాల వరకు కూడా ఇది విస్తరించింది. దీనివల్ల భారతీయ వివాహ వ్యవస్థ మరింత ప్రభావితమవుతుందని.. లోటుపాట్లకు గురవుతుందని అంచనాలు ఉన్నాయి.
వివాహ వ్యవస్థ గురించి మనదేశంలో అనేక న్యాయస్థానాలు అనేక విధాలుగా తీర్పులు ఇచ్చాయి. కేసుల ఆధారంగా ధర్మాసనాలు తమ తీర్పులను ప్రకటించాయి. కొన్నిసార్లు వివాహాల గురించి.. మరికొన్నిసార్లు వ్యక్తిగత సంబంధాల గురించి న్యాయస్థానాలు సంచలన విషయాలను వెల్లడించాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ న్యాయస్థానం విభిన్నమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని.. పురుషుడికి మరింత స్వేచ్ఛ కల్పిస్తుందని.. అంతిమంగా అది వివాహ సంబంధాన్ని ఒడిదుడుకులకు గురి చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
మధ్యప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక కేసుకు సంబంధించి జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది.. ఓ వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత.. మరో మహిళకు దగ్గర అయ్యాడు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అతడి భార్య కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై ఆమె భర్త కూడా కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణకు తీసుకున్న ధర్మాసనం కీలకతీర్పు వెల్లడించింది..” ఒక మహిళను వివాహం చేసుకున్నప్పటికీ.. వయోజన యువతికి తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంది. ఒక పురుషుడు తన భార్య, ప్రియురాలితో కలిసి జీవించవచ్చని” ధర్మాసనం వెల్లడించింది. ఈ తీర్పును చాలా మంది ప్రగతిశీలమైనదని భావిస్తుంటారు. విస్తృత దృక్కోణాలను పరిశీలిస్తే ఇది మహిళల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒక పురుషుడు బహిరంగం గానే ప్రియురాలితో సంబంధాన్ని కొనసాగించే వ్యవహారాన్ని పరోక్షంగా బలపరుస్తుంది. చట్టాలు తరచుగా దుర్వినియోగానికి మనదేశంలో ఈ తీర్పు మరింత ఆందోళనలను రేకెత్తించే ప్రమాదం లేకపోలేదు. “భార్య అనుమతి లేకుండా వివాహితుడితో కలిసి జీవించాలి అనుకున్న వయోజన యువతికి కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందనుకుంటే.. ఇలాంటి తీర్పును వెల్లడించడం అత్యంత బాధాకరమని” విశ్రాంత న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వివాహం గనక జరిగితే అది చట్ట విరుద్ధమని.. మరో మహిళ జీవితానికి తీవ్ర వ్యతిరేకమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.