
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ సినీ పరిశ్రమలోని నటీనటులు ఏమి చేసినా కాస్త అతిగా చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరు భామలు, పైగా ఇటీవల వీరిద్దరికీ పెళ్లి అయింది కూడా. హ్యాపీగా భర్తలతో సరదాగా గడపకుండా ప్రజా సేవలో తరిస్తూ.. భర్తలకు విరహవేదనను మిగులుస్తున్నారు. మరి వీరి వేదనలో సేవ ఎంతో ? పబ్లిసిటీ ఎంతో నెటిజన్లకు కూడా అర్ధం కాక, వాళ్ళు కూడా చూసి చూడనట్టు వీళ్ళ సేవ పై రియాక్ట్ కావడం లేదు.
ఇంతకీ ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేగా ? పేర్లు.. ప్రణీత సుభాష్, సంజనా గల్రాని. వీళ్ళు ఇటీవల ఓ ఇంటివారయ్యారనే విషయాన్ని వీళ్ళు పూర్తిగా వదిలేసి, బెంగళూరు సిటీ రోడ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లాక్ డౌన్ లో నితిన్ అనే వ్యాపారవేత్తని ప్రణీత సుభాష్ సడెన్ గా పెళ్లి చేసుకొని తన అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
అలాగే బోల్డ్ బేబీ సంజనా కూడా ఒక డాక్టర్ ను రహస్యంగా పెళ్లి చేసుకొని, తన పెళ్లి విషయాన్ని ఏకంగా ఆర్నెళ్లు దాచింది. మొత్తానికి గత నెలలోనే తనకు పెళ్లి జరిగిన విషయాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పింది. అసలు కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు ఏమి చేస్తారు ? భర్త సానిహిత్యంలో సేద తీరుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి భర్తతో చర్చిస్తూ ఉంటారు.
కానీ ప్రణీత, సంజన మాత్రం పలు సేవా కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. వాస్తవానికి కరోనా సెకెండ్ వేవ్ మొదలైనప్పటి నుండి వీరిద్దరూ పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ.. రోడ్ల మీద జీవనం సాగిస్తోన్న అభాగ్యులకు అన్నదానం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రణీత సుభాష్ గత ఏడాది లాక్ డౌన్ నుండే ఎన్నో సేవ కార్యక్రమాలు చేసింది. తన పేరు మీద ఒక ఫౌండేషన్ ను కూడా స్థాపించి.. ఆ ఫౌండేషన్ ద్వారా నిరంతర సేవ కొనసాగిస్తూనే ఉంది.
ఏది ఏమైనా సినిమాల్లో గ్లామర్ పాత్రలతో లారించిన అందాల ముద్దుగుమ్మలు ఇలా సేవ కార్యక్రమాల్లో పోటీ పడుతుండటం నిజంగా గొప్ప విషయమే. ప్రణీత త్వరలోనే బీజేపీలో చేరుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి రాజకీయాల కోసమే ప్రణీత ఈ సేవ చేస్తోందేమో చూడాలి.